✍️ప్రాథమిక పాఠశాలల విభజన సరికాదు: ఎమ్మెల్సీలు
🌻ఈనాడు, అమరావతి: ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలను రెం డుగా విభజించడం సరికాదని, జాతీయ నూతన విద్యా విధానం ఇలాంటి ప్రక్రియను చెప్పలేదని ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, శ్రీని వాసులురెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ, షేక్ సాల్జీ వెల్లడించారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమ స్యలపై బుధవారం విజయవాడలో మంత్రి బొత్సతో ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా చర్చించారు. అన్ని పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపా ధ్యాయ పోస్టులను కొనసాగిస్తామని మంత్రి బొత్స సత్య నారాయణ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీలు తెలిపారు. సబ్జెక్టు టీచర్ల పనిగంటలు తగ్గించేందుకు, ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించేందుకు, ప్రాథ మిక బడుల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను యథావిధిగా ఉంచేందుకు మంత్రి అంగీకారం తెలిపినట్లు వెల్లడిం చారు. పాఠశాలల మ్యాపింగ్, 1-8 తరగతుల వరకు ఆంగ్ల ఒక్కటే అమలు చేయడం తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలనీ, వీటిని కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు. దీన్ని ఎమ్మెల్సీలు వ్యతిరేకించారు. ఉపాధ్యాయ బదిలీల్లో జీరో సర్వీసుకు అనుమతించను న్నారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ ఆపరేటర్, వాచ్మ న న్ను నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తగా ప్రారంభించనున్న జూనియర్ కళాశాలల్లో పీజీటీలుగా స్కూల్ అసిస్టెంట్లకు, ప్రిన్సిపాళ్లుగా ప్రధానోపాధ్యాయు లకు పదోన్నతులు కల్పించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రతినెలా ప్రజాస్వామికంగా చర్చించే విధా నాన్ని తీసుకురానున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
0 Comments:
Post a Comment