డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మంచిదా సింగిల్ డోర్ మంచిదా.?
ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ ప్రతీ ఇంట్లో కామన్ గా ఉంటుంది. అయితే సింగిల్ డోర్, డబుల్ డోర్ అనేది మన ఇష్టం. ఇక ఈ రెండు ఫ్రిడ్జ్ లకు ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం.
వాస్తవంగా మాట్లాడాలి అంటే. డబల్ డోర్ , సింగిల్ డోర్ ఫ్రిడ్జిలకు పెద్ద తేడా ఉండదు. టెక్నికల్ గా చూస్తే ఫ్రిడ్జిలు రెండు రకాలు " డైరెక్ట్ కూల్ " , "ఫ్రాస్ట్ ఫ్రీ ". ఇందులో డైరెక్ట్ కూల్ అనేవి ఫ్రాస్ట్ ఫ్రీ కంటే తక్కువ రేటు కి దొరుకుతూ ఉంటాయి.
ఈ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జెస్ లో టెంపరేచర్ కంట్రోల్ అనేది మాన్యువల్ గానే చెయ్యాల్సి ఉంటుంది. ఫ్రీజర్ లో టెంపరేచర్ ఒకే ఫ్లో లో ఉంటుంది. అందుకే ఫ్రిడ్జ్ లోపల పెట్టిన వెజిటబుల్ ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. అదే ఫ్రాస్ట్ ఫ్రిడ్జెస్ లో అలా కాదు. ఈ టెక్నాలజీ వలన ఫ్రిడ్జిలో ఉంచిన వస్తువలపైనా టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది , ఎప్పుడూ చల్లగా కాకుండా , ఫుడ్ , కాయగూరలు అనేవి చెడిపోకుండా ఉండడానికి తగ్గట్టు ఆర్టిఫీషియల్ గా ఒక క్రమబద్దీకరణ ఏర్పాటు అవుతుంది.
ఇక వాటిని మెయిన్టెన్స్ విషయానికి వస్తే డైరెక్ట్ కూల్ లో ఉన్న ఫ్రీజర్ అప్పుడప్పుడు ,ఐస్ గడ్డ కడుతుంది. అప్పుడు కాస్త బటన్ ప్రెస్ చేసి దాన్ని తీసేయ్యాలి. అది కొంచెం తలనొప్పి వ్యవహారం. అది ఓవర్ ఫ్లో అయితే ఆ నీళ్ళు ఇంటి ఫ్లోరె లోకి వస్తాయి. ఫ్రాస్ట్ ఫ్రీ మోడల్స్ కి అటువంటి సమస్య లేదు. ఆటోమేటిక్ గా దానికి అదే ఐస్ గడ్డ కట్టకుండా జాగ్రత్త పడుతుంది. ఐస్ క్యూబ్స్ ఎక్కడ అవసరం అవుతాయో అక్కడ మాత్రమే ఐస్ గడ్డ కడుతూ ఉంటుంది. ఒకరకంగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది.
0 Comments:
Post a Comment