అందానికి జయప్రద(jayaprada), అభినయానికి జయసుధ, డాన్స్ కి శ్రీదేవి.. ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు టాలీవుడ్ ని దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఏలారు.
ఈ ముగ్గురు హిందీలో కూడా రాణించారు. అయితే ఈ ముగ్గురు నిజ జీవితంలో మాత్రం కష్టాల పాలయ్యారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ ముగ్గురు కూడా నిర్మాతలనే పెళ్లాడారు.
అద్భుతమైన కెరియర్ తో ఒకరికొకరు పోటాపోటీగా నటన ప్రదర్శించిన ఈ ముగ్గురు హీరోయిన్లు జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వారి జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న శ్రీకాంత్ నహతా ను పెళ్లి చేసుకున్న జయప్రద ఆయనతో ఎక్కువ కాలం కలిసి ఉండలేక పోయింది.
కోట్ల ఆస్తులు సంపాదించిన సొంత కుటుంబ సభ్యులే ఆస్తి మొత్తాన్ని హరించారు. అన్నీ పోగొట్టుకున్న జయప్రద చివరకు పొలిటీషియన్ అమర్ సింగ్ చెంతన చేరి అతనికి కూడా దూరమై ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది.
సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ(jayasudha) డబ్బు, ప్రజాభిమానం సంపాదించుకున్నా జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయిందనే చెప్పాలి.
ఒక నిర్మాత ని పెళ్లి చేసుకొని తర్వాత ఆమె ఆయన ప్రవర్తనతో విసిగిపోయి ఆ తర్వాత నిర్మాత నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన అతడు జయసుధ డబ్బులతో సినిమాలు తీసి నష్టాలను చూపించాడు.
ఆస్తి అంతా పోగొట్టుకొని చివరకు ఆమె ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో అద్దెకు ఉండేది. మానసికంగా నితిన్ కృంగిపోయి చివరకు సూసైడ్ చేసుకున్నాడు.
అందాల తార శ్రీదేవి(sridevi) గురించి చెప్పుకుంటే వెండితెరపై తన హావభావాలతో ఉర్రూతలూగించినా ఈమె జీవితంలో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. జీవితమంతా కుటుంబం కోసమే కష్టపడాల్సి వచ్చింది.
నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లాడిన శ్రీదేవి చివరకు ఆమె డబ్బుతో సినిమాలు తీసి ఆస్తులన్నీ కరిగించేశాడు. గుట్టుగా జీవితాన్ని నెట్టుకొచ్చి సైలెంట్ గానే ఈ లోకాన్ని వీడింది శ్రీదేవి.
0 Comments:
Post a Comment