ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం.. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.
సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping).. ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమితో బాధపడడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, మనం చేసే పని వంటి వాటిని నిద్రలేమికి కారణాలుగా చెప్పవచ్చు.
లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది..
నిద్రలేమి కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. బరువు పెరుగుతారు. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నిద్రలేమి వల్ల షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 నుండి 15 శాతం లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. కనుక రోజూ 6 నుండి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మనం వంటింట్లో ఉపయోగించే పదార్థాలను వాడి ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు.
మంచి రాత్రి నిద్ర (good sleep) రావాలంటే ఆహారంలో తేనె (Honey) చేర్చండి. సహజ చక్కెర, తేనె ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.
ఇది ట్రిప్టోఫాన్ , సెరోటోనిన్లను మెదడుకు ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది..
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ధనియాలతో కాఫీ ని చేసుకుని పడుకునే ముందు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
ధనియాలను ఒక అర గంట ముందు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరగబెట్టి దానిని వడకట్టుకోవాలి.
ఈ కషాయంలో తగినన్ని పాలను, పంచదారను వేసి కలిపి కాఫీలా చేసుకుని పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
0 Comments:
Post a Comment