Benefits Of Bitter Gourd Seeds: కాకరకాయ గింజల వల్ల డయాబెటిక్ పేషెంట్లకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Benefits Of Bitter Gourd Seeds: కాకరకాయ వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు దోహదపడతాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకరకాయతోనే కాకుండా వీటి గింజలు ద్వారా కూడా డయాబెటిక్ పేషెంట్లకు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.
ప్రస్తుతం చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయ కూర వండేటప్పుడు వాటి గింజలను తొలగించి వండుతున్నారు. ఇలా చేయడం వల్ల కాకరకాయ లో ఉండే విటమిన్స్ శరీరానికి తగిన మోతాదులో అందలేకపోతున్నాయి. డయాబెటిక్ పేషెంట్ల కోసం కాకరకాయ వండే క్రమంలో తప్పకుండా వీటి గింజలతో వందలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలను ఆహారంలో తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని వారు తెలుపుతున్నారు. అయితే ఈ గింజల ద్వారా లభించే ఇతర ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాకరకాయ గింజల వల్ల వచ్చే ప్రయోజనాలు:
మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది:
డయాబెటిక్ పేషెంట్స్ కోసం కాకరకాయను వండే క్రమంలో తప్పకుండా వాటి గింజలతో వండలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వండుకొని తినడం ద్వారా శరీరంలో జీవక్రియ మెరుగుపడి మలబద్దకం సమస్యలు తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
డయాబెటిక్ పేషెంట్లో అధికశాతం కొలెస్ట్రాల్ ఉంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితిలో కాకరకాయ గింజలతో ఈ తీవ్రతను నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కాకరకాయ గింజలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి, దృఢంగా చేస్తాయి.
కాకరకాయ గింజలను ఈ విధంగా ఉపయోగించండి:
కాకర గింజలను ఎండబెట్టి పొడిగా చేసి వేడినీళ్లలో వేసుకుని తాగితే.. పొట్ట శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా గింజలను, వెల్లుల్లి తో కలిపి గ్రైండ్ చేసి పూరీలు చేసుకునే క్రమంలో కూడ వాడుకోవచ్చు.
0 Comments:
Post a Comment