దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపొయింది. ఎంతలా అంటే పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతిలోనే ఉంటుంది.
మరి అలా వాడుతున్నప్పుడు ఫోన్లో చిన్న సమస్య వచ్చిన దానిని పక్కకు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే అది బ్యాటరీ ప్రాబ్లమ్.
ఫోన్ వాడకం ఎక్కువగా ఉండటం వలన బ్యాటరీ వేడెక్కి పనిచేయకుండా పోతుంది. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు.
చార్జింగ్ తొందరగా అయిపోవడం, చార్జింగ్ పెట్టినప్పుడు మెల్లగా ఎక్కడం వంటి సమస్యలు వినియోగదారులు అనుభవించే ఉంటారు.
మళ్ళీ కొత్త బ్యాటరీలను కొని ఫోన్‌ను వాడుతుంటారు. అయితే ధర ఎక్కువ కారణంగా ఒరిజినల్ బ్యాటరీలను కాకుండా తక్కువ ధరలో వచ్చే సెకండ్ క్వాలీటి బ్యాటరీలను కొంటారు.
కంపెనీ సర్వీస్ సెంటర్ లో కూడా కొన్నిమోడల్ల బ్యాటరీలు అందుబాటులో ఉండవు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా చైనీస్ కంపెనీ Xiaomi కొత్త ఆఫర్‌ను తెచ్చింది.
ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ Xiaomi ఇండియాలో కొత్తగా వినియోగదారుల కోసం బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.499. బ్యాటరీ రీప్లేస్మెంట్ ధర స్మార్ట్ ఫోన్ విలువపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది.
పాత స్మార్ట్ఫోన్లు లేదా సాధారణ ఫోన్లను కలిగిఉన్న వినియోగదారులు బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం దగ్గరలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని కంపెనీ పేర్కొంది.
Xiaomi వినియోగదారులు Xiaomi సర్వీస్+ యాప్ ద్వారా సర్వీస్ సెంటర్‌కు ఆన్లైన్లో అపాయింట్మెంట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ ప్రోగ్రామ్ Xiaomi, Redmi బ్రాండ్ స్మార్ట్ఫోన్లకు వర్తిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ధరలో బ్యాటరీ మార్చుకోవచ్చు.
0 Comments:
Post a Comment