Banks - House loan intrest-
బ్యాంకులు గృహ రుణ రేట్లు పెంచేశాయ్ .
గృహ రుణ రేట్లు పెంచిన బ్యాంక్ ల వివరాలు
ఐసీఐసీఐ ( ICICI ) బ్యాంకు
ఆర్బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో ఎకర్నల్ బెంచ్మర్క్ లెండింగ్ రేట్ ( EBLR ) ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది . పెంచిన రేటు బుధవారం ( జూన్ 8 ) నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది . దీంతో ఈ బ్యాంకు ఈబీఎస్ఆర్ ( EBLR ) రేటు 8.10 శాతం నుంచి 8.60 శాతానికి పెరిగింది .
బ్యాంకు ఆఫ్ బరోడా ( Bank of Baroda )
బ్యాంకు ఆఫ్ బరోడా కూడా రిటైల్ లోన్లపై బరోడా రేపో లింక్డ్ లెండింగ్ రేటు ( BRLLR ) ను 7.40 శాతానికి పెంచింది . ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది . ప్రస్తుతం ఈ బ్యాంకులో గృణ రుణాలపై వడ్డీ రేట్లు 7.40 - 8.75 శాతంగా ఉన్నాయి . కారులోను రేట్లు 7.90 శాతం నుంచి , మోర్టిగేజ్ రుణ రేట్లు 9.10 శాతం నుంచి ఉన్నాయి .
పంజాబ్ నేషనల్ బ్యాంక్
రెపో లింక్డ్ లెండింగ్ రేటు ( RLLR ) ను 6.90 శాతం నుంచి 7.40 శాతానికి పెంచింది . ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది .
బ్యాంక్ ఆఫ్ ఇండియా ( BOI )
రెపోరేటుకు అనుసంధానమై ఉండే రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం చేసినట్లు ' బ్యాంక్ ఆఫ్ ఇండియా ' ప్రకటించింది . కొత్తరేటు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది .
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .
మరో ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను పెంచేసింది . ప్రస్తుతం 7.25 శాతంగా ఉన్న ఆర్బీఎస్ఆర్ ( RBLR ) ను 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతంగా చేసినట్లు వెల్లడించింది . ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది .
0 Comments:
Post a Comment