Astrology Tips: ఈ చెడు అలవాట్లు మీకు ఉన్నాయా..? వెంటనే మార్చుకోండి.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడండి..
మనిషి జీవితంలో కొన్ని చెడు అలవాట్లను ఎంత ప్రయత్నించినా మానేయలేరు.
వాటి వల్ల ప్రాణం పోతుంది అని తెలిస్తే మాత్రం తప్పకుండా మానేసే అవకాశం ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చెడు అలవాట్లు ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టిస్తాయి. దీని వల్ల ఇంట్లో పేదరికం పెరిగిపోతుంది.
అవి చాలామందికి చెడుగా అనిపించకపోయినా.. వాటి వల్ల అనర్థాలు జరుగుతాయని జోతిష్యులు చెబుతున్నారు. అవి ఏంటంటే.. నెలపై నడిచే సమయంలో చాలామంది ఈడ్చుకుంటూ నడుస్తారు. అలా చేయడం మంచిది కాదట. ఇది వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వంటగదిలో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు. సాధారంగా వంటగదిలో ఎక్కువగా గృహిణులు ఉంటారు. వంట చేసే సమయంలో సాధారంగా వస్తువులను చెల్లాచెదురుగా పడేస్తుంటారు. అయితే వాటిని మళ్లీ ఎక్కడివి అక్కడ పెట్టేస్తే బాగానే ఉంటుంది కానీ.. కొందరు అలా చేయకుండా ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మిదేవికి అస్సలు నచ్చదని జ్యోతిష్యులు చెబుతన్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
గోర్లను పంటితో తీసుకోవడం. గోర్లను నమలడం. ఇలా ఈ రెండు పనులు కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది చెడ్డ అలవాటు కూడా. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడంతో పాటు.. ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మురికిగా ఉండటం కూడా ఆర్థిక సంక్షోభానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీ దేవి కొలువై ఉంటుందనేది విశ్వాసం. మురికిగా ఉండకుండా.. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటంతో ఆరోగ్యంతో పాటు.. ఆర్థిక సంక్షోభం కూడా రాదని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment