Astro Tips - భారతీయ వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
భారతీయ వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
* పక్కమీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు.
* ఉదయం నిద్రలేవగానే ఉత్తరదిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
* తూర్పు గోడలోనే దేవుని పూజ కొరకు ఏర్పాటు చేసుకోవటం మంచిది.
* ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మాణం చేయకూడదు, శుభదాయకం కాదు.
* ఇంటి ప్రధాన గుమ్మం లోపలి వైపు భోజపత్ర యంత్ర యుక్త గోమాత సామెత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదులు ఉండే పటాన్ని అమర్చుకుని దాని కింద నుండి నడిస్తే మంచింది, పనులమీద బయటకు వెళ్ళిన పనులు నిర్విఘ్నంగా సకాలంలో అభీష్టసిద్దిగా నెరవేరుతాయి.
* గృహాన్ని ఊడ్వడం (చిమ్మేటప్పుడు) ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగుచేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు.
* ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు వైపు ముఖం ఉండేట్టు నిలబడి వంట చేయాలి.
* ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.
( ఇంటి నిర్మాణానికి అనుకూలం కాని స్థలాలు )
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
* స్థలంలోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది. స్తలం చతురస్రం కానీ ధీర్ఘచతురస్రం ఆకారంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
* చేట ఆకారంలో గల స్థలం మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.
* స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారో గ్యం కలిగిస్తుంది.
* విసనకర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తి మంతుల్నైనా సరే ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
* లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
* డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలను ఉత్పన్నం చేస్తుంది, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
* కుంభాకార స్థలం వలన భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
* మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను, విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
* అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక శాంతి లోపిస్తుంది, తరచుగా దొంగతనాలు, దోపిడీలు జరుగుతుంటాయి.
( గృహావరణలో మెట్లు )
మెట్లను నిర్మించటంలో శాస్త్ర పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే...
* మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.
* రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
* రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగానూ, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చును.
* ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర - ఈశాన్యాలవైపు ఇంటి స్థలాన్ని బట్టి నియమితమైన కొంత భాగాన్ని వదలి నిర్మించుకోవాలి.
* ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు తాకకూడదు.
* మెట్లను ఎల్ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చును.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం.
తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
0 Comments:
Post a Comment