APTET 2022 Notification, Schedule, Online Apply
AP TET 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షా తేదీలు, ఫీజు సహా పూర్తి వివరాలు ఇవే
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్ కాసేపటిక్రితమే విడుదలయింది. టెట్ (AP TET 2022) ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని http://aptet.apcfss.in వెబ్సైట్లో ఉంచారు.
APTET : 2022
బి.ఎడ్ చేసిన అభ్యర్థులు PAYMENT చేసేటప్పుడు SGT APPLY చేసుకోదలచిన వారు.
✳️ SGT మరియు SA రెండింటికి ఒకేసారి SELECT చేసుకుని AMOUNT PAY చేయగలరు.
✳️అలా కాకుండా ఒకటి SELECT చేసుకుని PAYMENT చేశాక మరలా SGT రాయాలనుకన్న PAYMENT చేయడానికి OPTION రాదు.
✳️ ఒకసారి CANDIDATE ID వచ్చాక మరలా రాదు .
✳️అందుకు DATE OF BIRTH ప్రామాణికంగా ఉంటుంది.
నోటిఫికేషన్ (AP TET Notification), ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్సైట్ ద్వా రా తెలుసుకోవచ్చ ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు.
అభ్యర్థులు ఆన్లైన్లో టెట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు ఫీజును ఒక్కో పేపర్కురూ.500గా నిర్ణయించారు. టెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 16 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు జులై 16 వరకు గడువు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: జూన్ 10, 2022
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడవు: జూన్ 15 నుంచి జులై 15, 2022 వరకు
ఆన్లైన్ దరఖాస్తులకు గడువు: జూన్ 16 నుంచి జులై 16, 2022 వరకు
హెల్ప్ డెస్క్ సర్వీస్: జూన్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఆన్లైన్ మాక్ టెస్ట్: జులై 26 నుంచి అందుబాటులో ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్: జులై 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఎగ్జామ్స్ తేదీలు: ఆగస్టు 6 నుంచి 21 వరకు..
ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 31, 2022
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు: సెప్టెంబరు 1 నుంచి 7 వరకు
తుది కీ ప్రచురణ తేదీ: సెప్టెంబరు 12, 2022
తుది పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబరు 14, 2022
టెట్ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది.
చాలా రోజులుగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
APTET 2022 Notification, Schedule, Online Apply APTET 2022 Notification, Schedule, Online Application APTET August 2022 Notification, Schedule, Exam Dates, Fee Payment Application Form, Syllabus, Eligibility
APTET August 2022 Schedule:
APTET AUGUST-2022 NOTIFICATION FOR ONLINE APPLICATION & COMPUTER BASED TEST
Ref: –
1. RTE Act-2009, Minister of Law and Justice, Govt of India, Dated:27.08.2009.
2. NCTE Gazette Notifications from time
3. NCTE, Guidelines for conduct of TET from time totime.
4. G.O.Ms.No. 23 School Education (Exams) Department, Dt:17.03.2021
5. G.O.Ms.No.68 School Education (Exams) Department, Dt:25.10.2021
6. G.O.Ms.No.69 School Education (Exams) Department, Dt:25.10.2021
7. G.O.Ms.No. 27 School Education (Exams) Department, Dt:27.05.2022
The Andhra Pradesh Teacher Eligibility Test (APTET-August, 2022) will be conducted by Department of School Education, Government of Andhra Pradesh in all Districts through a Computer Based Test. The objective of TET is to ensure National Standards and benchmark of Teacher quality in the recruitment process in accordance with the National Council for Teacher Education(NCTE).
Online applications are invited for the Andhra Pradesh Teacher Eligibility Test (APTET- August, 2022) from the candidates aspiring to be Teachers in State Government, MandalParishad, ZillaParishad, Municipality, Private Aided Schools and Private un-aided schools etc., under the control of Andhra Pradesh State for classes I to VIII. Govt. of India have enacted RTE Act, 2009 on 27.08.2009 titled “The Right of Children to Free and Compulsory Education”. Sub-Section (1) of section 23 of the RTE Act, National Council for Teacher Education (NCTE), New Delhi has laid down minimum qualifications for a person to be eligible for appointment as aTeacher for Classes I to VIII in its Principal Notification dated 23rd August, 2010 and amendments issued thereon. The minimum qualification include a Pass in Teacher Eligibility Test (TET). Pursuant to the said Guidelines, it has been decided to conduct Teacher Eligibility Test (TET) once in a year in the State of Andhra Pradesh.
APTET 2022 Notification click here
0 Comments:
Post a Comment