AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో జాబ్స్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు మరో ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 18న అంటే ఎల్లుండి మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ GRANUELS INDIA LTD సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాను వైజాగ్ లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
టెక్నికల్ ట్రైనీ-ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే, కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు వయస్సు 20 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా 2021 నుంచి 2022 మధ్యలో పాసై ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల వేతనం ఉంటుంది.
ఇతర వివరాలు:
-అభ్యర్థులు మొదటగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు MVR Degree & PG College in Gajuwaka, Vizag చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఆధార్ కార్డ్ జిరాక్స్ ను అభ్యర్థులు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- ఎంపికైన వారికి ఉచితంగా రవాణ సదుపాయం ఉంటుంది. రాయితీపై క్యాంటీన్ సదుపాయం ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9292553352 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
0 Comments:
Post a Comment