AP Inter Acdamic Calendar -ఇంటర్మీడియట్ 2022-23 సంవత్సరపు అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.
మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22 నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేస సెలవులు ప్రకటించనున్నారు.
2022-23 ప్రకారం జూలై 1న కాలేజీలు తెరుస్తారు. సెప్టెంబర్ నుంచి 7 వరకు త్రైమాసిక పరీక్షలు జరుగుతాయి. అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులుంటాయి. అక్టోబర్ 10న కాలేజీలు తెరుస్తారు. నవంబర్ 14 నుంచి 19 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి.
2023 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుంటాయి. జనవరి 18న కాలేజీలు తెరుస్తారు. జనవరి 19 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 8 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు థియరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 21తో కాలేజీలు ముగుస్తాయి. ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు వేసవి సెలవలు ఉంటాయి. మే చివరి వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయి.
ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయకూడదని.. అలా చేసినయెడల కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇక ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఇంటర్మీడియట్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న కాలేజీ విషయంలో వీలైనంత తొందరగా స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment