AP DEE సెట్ నోటిఫికేషన్ విడుదల
విజయవాడ, గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య విభాగం - డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈ సెట్) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ డైట్‌లు (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్), ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రెయినింగ్ సంస్థల్లో అడ్మిషన్స్ ఇస్తారు. మేథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో 25 శాతం సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ డైట్‌లలోని సీట్లు, ప్రైవేట్ సంస్థల్లోని ఎ కేటగిరీ సీట్లను సింగిల్ విండో పద్దతిలో; ప్రైవేట్ సంస్థల్లోని బి కేటగిరీ సీట్లను ఆ సంస్థల నిర్ణయం మేరకు భర్తీ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు మాత్రమే అర్హులు. ఏపీ డీఈఈ సెట్ 2022కు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్/పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఒకేషనల్ కోర్సులు చేసినవారు దరఖాస్తుకు అనర్హులు. డిప్లొమా కోర్సులో మేథమెటిక్స్‌ను ఎంచుకోవాలంటే ఇంటర్‌లో మేథ్స్ ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే ఫిజికల్ సైన్స్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ; బయలాజికల్ సైన్స్‌కు బోటనీ, జువాలజీ; సోషల్ స్టడీస్‌కు సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్‌లలో ఏవైనా రెండు సబ్జెక్ట్‌లు చదివి ఉండాలి. అభ్యర్థుల వయసు సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.
డీఈఈ సెట్ వివరాలు: ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో 60, రెండో పార్ట్‌లో 40 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. మొదటి పార్ట్‌లో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, తెలుగు అంశాలనుంచి ఒక్కోదానిలో 5; ఎంచుకొన్న లాంగ్వేజ్(తెలుగు/ తమిళం/ ఉర్దూ/ ఇంగ్లీష్), మేథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అంశాల నుంచి ఒక్కోదానిలో 10 ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్‌లో అభ్యర్థులు సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంటుంది. మేథమెటిక్స్‌లో 40; ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ఒక్కోదానిలో 20; బయలాజికల్ సైన్స్‌లో బోటనీ, జువాలజీ నుంచి ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. సోషల్ స్టడీ్‌సలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ నుంచి ఒక్కోదానిలో 13 ప్రశ్నలతోపాటు ఆ సబ్జెక్టుల్లో ఒకదాని నుంచి మరో ప్రశ్న ఇస్తారు. మొదటి పార్ట్‌లో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఏపీ స్టేట్ సిలబస్ ఆధారంగా; రెండో పార్ట్‌లో ఏపీ ఇంటర్ బోర్డు సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి ఎంచుకొన్న ప్రకారం తెలుగు/ఉర్దూ/తమిళం/ ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రశ్న పత్రం ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. డీఈఈ సెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్, బీసీ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు రావాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 శాతం మార్కులు వస్తే చాలు. వీరు జనరల్ కేటగిరీ సీట్లకు పోటీ పడాలంటే మాత్రం 35 శాతం మార్కులు తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.600
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 20
హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్: జూన్ 25
ఏపీ డీఈఈ సెట్ 2022 తేదీ: జూన్ 28, 29
ఫలితాలు విడుదల: జూలై 4
వెబ్‌సైట్: https://apdeecet.apcfss.in
0 Comments:
Post a Comment