AP 10th Class Results 2022 / AP SSC Results 2022
AP SSC Results 2022- All the students who have appeared for the examination will be able to check the result for the same on the official portal. The examination conducting body directorate of government examination, Andhra Pdaresh conducted the 10th board examination on 27th April 2022 and the exam was winded up on 9th May 2022.
అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది పాసయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు బొత్స చెప్పారు. ఫలితాలకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు.
‘‘ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు జరిగాయి. మే 13-22 మధ్య స్పాట్ వాల్యుయేషన్ చేశాం. పరీక్షలకు మొత్తం 6,15,908 మంది విద్యార్థులు హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలే పైచేయి సాధించారు. 2,02,821 మంది బాలురు, 2,11,460 మంది బాలికలు పాసయ్యారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురులో 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.30శాతంతో ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా 49.70శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,671 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా.. వీటిలో 797 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది’’ అని మంత్రి బొత్స వివరించారు.
రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటించారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
🌷సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పది పరీక్ష ఫలితాలు విడుదల.
🌴ఫలితాలను క్రింది వెబ్‌సైట్స్ ల ద్వారా చూసుకోవచ్చు
http://results.eenadu.net/tenth-results-2022/ap-10th-ssc-results-2022.aspx
https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html
https://www.examresults.net/ap-board-result/ssc/
http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp
http://www.schools9.com/Articles/andhra-pradesh-ssc-class-10th-results-ap-ssc-10-result.aspx
🌼AP 10th Class Results: వాయిదా పడ్డ ఏపీ పదో తరగతి ఫలితాలు.. తదుపరి తేదీ ఎప్పుడంటే..
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఫలితాలను వాయదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు.
పరీక్షా ఫలితాలను సోమవారం (జూన్6) రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అనివార్య కారణాల వల్ల ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
🎯జూలై మొదటి రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఈ రోజు (4.6.2022) ఉదయం 11 గం. లకు విడుదల కానున్న SSC ఫలితాల డైరెక్ట్ లింక్స్....
0 Comments:
Post a Comment