Anti-Corruption Bureau (ACB) 14400 App DOWNLOAD CLICK HERE
ACB 14400: ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను తెచ్చింది. 'ఏసీబీ 14400' పేరుతో రూపొందించిన యాప్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ప్రభుత్వ విభాగాల్లో ఎవరైనా.. ఎక్కడైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సీఎం తెలిపారు. యాప్‌లో బటన్ నొక్కి, వీడియో లేదా ఆడియో రికార్డు చేసి ఏసీబీకి ఫిర్యాదు పంపవచ్చని చెప్పారు. అవినీతిని నిరోధించడానికి ఇది విప్లవాత్మకమైన మార్పని సీఎం అన్నారు.
ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతిని నిరోధించడంలో బాధ్యత ఉందన్న సీఎం.. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు. మన స్థాయిలో అనుకుంటే.. 50 శాతం అవినీతి అంతం అవుతుందని, మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడం మన కర్తవ్యమని, ఎవరైనా ఏసీబీకి చిక్కితే.. కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ హెచ్చరించారు.
0 Comments:
Post a Comment