Andhra News: డబ్బులు ఉన్నప్పుడే ఇస్తాం..కోర్టుకెళ్లొద్దు: ఏపీలో కొత్త నిబంధన..
కృష్ణా డెల్టాలో మురుగు కాలువల మరమ్మతుల కోసం బాపట్ల జలవనరులశాఖ టెండర్లు పిలిచింది. అయితే, టెండర్ల నిబంధనల్లో కొత్తగా చేర్చిన అంశం సర్వత్రా విమర్శలకు కారణమైంది.
తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడే గుత్తేదారులకు సొమ్ము చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ సకాలంలో డబ్బులు చెల్లించకపోతే న్యాయస్థానాలకు వెళ్లొద్దని నిబంధన విధించింది. తాము పెట్టిన నిబంధనలు అంగీకరించిన వారే ఈ టెండర్లలో పాల్గొనాలని షరతు పెట్టింది. బాపట్ల జలవనరుల శాఖ పెట్టిన ఈ నిబంధనలపై గుత్తేదారులు మండిపడుతున్నారు. పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఉపాధిహామీపథకం బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వడ్డీతో సహా గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు రాక ఆందోళనబాట పట్టగా, మరి కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జలవనరులశాఖ ముందుగానే తమకు అనుకూలంగా షరతులు పెట్టింది. జలవనరులశాఖ నిబంధనలు చూసిన గుత్తేదారులు టెండర్లు వేస్తారో లేదో వేచి చూడాలి.
0 Comments:
Post a Comment