మన దేశంలో ఎన్నో నదులున్నాయి. గోదావరి, కృష్ణ, గంగా, యమునా, కావేరీ, తుంగభద్ర.. ఇలా చాలా నదులు అన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి. ఐతే ఈ నదులపై ఎక్కడో ఓచోట బ్రిడ్జి ఉంటుంది.
ఒక్కటేమిటి.. చాలానే ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటైన ఓ నదిపై మాత్రం.. అసలు ఒక్క బ్రిడ్జి కూడా లేదు. వేల కిలో మీటర్లు ప్రవహిస్తుంది. చాలా దేశాల గుండా వెళ్తుంది. కానీ దానిపై ఒక్కటంటే..ఒక్క బ్రిడ్జి కూడా లేదు.
అదే.. అమెజాన్ (Amazon River) నది. నైలు నది తర్వాత.. ఇదే అతి పెద్దది. దీని పొడవు 6,400వేల కి.మీ. కంటే ఎక్కువ. బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజ్వెలా, గయానా, ఫ్రెంచ్ గయానా, సురినామ్ వంటి దేశాల గుండా ప్రవహిస్తుంది.
నైలు నది (Nile River) ప్రపంచంలోనే అతి పొడవైన నది (World's Longest River) కావచ్చు. కానీ మంచి నీటి విషయంలో మాత్రం అమెజాన్ నది ( Amazon River Facts) కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇందులో అనేక జలచరాలు నివసిస్తున్నాయి. డాల్ఫిన్లు, అనకొండతో పాటు ఎన్నో రకాల నీటి ప్రాణులకు ఆవాసంగా ఉంది. ఎన్నో వింతలు, విశేషాలను నెలవుగా ఉన్న అమెజాన్ నదిపై మాత్రం ఒక్క బ్రిడ్జి కూడా లేదు.
సాధారణంగా చిన్న చిన్న కాల్వలపైనే ఎన్నో బ్రిడ్జిలు మనకు కనిపిస్తుంటాయి. గ్రామాలను, నగరాలను కలుపుతుంటాయి. కానీ వేల కి.మీ. ప్రవహిస్తూ.. 9 దేశాలను కలిపే.. ఈ నదిపై మాత్రం ఒక్క వంతన కూడా లేకపోవడం వింతగా అనిపిస్తుంది. మరి దీనికి కారణమేంటి? (Why Amazon River Has No Bridge)
స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చైర్పర్సన్ వాల్టర్ కౌఫ్మన్ 'లైవ్ సైన్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెజాన్ నది గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అమెజాన్ నదిపై వంతనును నిర్మించాల్సిన అవసరం పడలేదని ఆయన చెప్పారు. అందుకే దానిపై బ్రిడ్జిలు లేవని పేర్కొన్నారు.
సాధారణంగా నది ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు వెళ్లేందుకు వంతెనలు కడుతుంటారు. కానీ అమెజాన్ పరీవాహక ప్రాంతాలకు ప్రజలు ఆ అవసరం ఇప్పటి వరకూ పడలేదు.
అమెజాన్ నది ఎక్కువగా జనాభా లేని ప్రాంతాల గుండానే ప్రవహిస్తుంది. ఇక జనాలు ఉండే ప్రాంతంలో ఫెర్రీలు, చిన్న చిన్న పడవలు తిరుగుతాయి. వాటి మీదుగా అవతలి ఒడ్డుకు చేరుకుటాయి.
అమెజాన్ బేసిన్లో అధిక జన సాంద్రత ఉన్న నగరాలు చాలానే ఉన్నాయి. అవి కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఐనప్పటికీ అక్కడ వంతెనలు ఉంటాయి. ఇవతలి నుంచి అవతలికి వెళ్లాలంటే ఫెర్రీనే వినియోగిస్తారు.
అమెజాన్‌పై బ్రిడ్జిలు లేకపోవడానికి.. మరో ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. వాల్ట్ కౌఫ్మన్ ప్రకారం.. ఈ నది ఒడ్డున మెత్తటి నేల ఉంటుంది.
అలాంటి చోట వంతెన నిర్మించడానికి చాలా ఖర్చు అవుతుంది. సాధారణంగా అక్కడ బ్రిడ్జిల అవసరం పడలేదు. ఒకవేళ నిర్మించాలనుకున్నా.. ఎక్కువ ఖర్చవుతుంది. ఈ కారణాల వల్లే అమెజాన్ నదిపై ఒక్క బ్రిడ్జి కూడా లేదు.
0 Comments:
Post a Comment