Adavi Donda Kayalu : ఈ కాయలు తింటే.. షుగర్ వ్యాధి పారిపోతుంది..!
Adavi Donda Kayalu : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.
ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. షుగర్ వ్యాధి బారిన పడిన వారిలో మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా చూడవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు సమయానికి ఏదో ఒకటి తినకపోయినా వారిలో చక్కెర స్థాయిలు తగ్గి నీరసించి పోతారు. వీరు ఎప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ వ్యాధిని మనం ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు.
షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎటువంటి ఔషధాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పంట పొలాల ద్గగర, చెరువు గట్ల మీద, చేనుకు వేసిన కంచెలకు అల్లుకుని పెరిగే కాకర దొండను ఉపయోగించి మనం ఈ వ్యాధి నుండి బయట పడవచ్చు. కాకర దొండ చూడడానికి మనం తినే దొండకాయ లాగే ఉంటుంది. దీనిని అడవి దొండ, చేదు దొండ అని కూడా అంటారు. మనకు గ్రామాలలో ఈ అడవి దొండ తీగ చెట్టు విరివిరిగా కనబడుతుంది. ఇతర చెట్లకు అల్లుకుని ఈ అడవి దొండ తీగ చెట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఈ చెట్టు కాయలు చాలా చేదుగా ఉంటాయి. కనుక వీటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ అడవి దొండకాయలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
Adavi Donda Kayalu
షుగర్ వ్యాధిని నయం చేయడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అడవి దొండకాయలు పచ్చగా ఉన్నప్పుడు ఎంత చేదుగా ఉంటాయో పండిన తరువాత అంత తియ్యగా ఉంటాయి. ఈ అడవి దొండకాయలను కూరగా చేసుకుని తినవచ్చు. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. లేదా ఈ కాయలను ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి నయం అవుతుంది. పచ్చి కాయలను తినలేని వారు ఈ కాయలు పండిన తరువాత వీటిని తినడం వల్ల కూడా షుగర్ వ్యాధి నయం అవుతుంది. ఈ విధంగా అడవి దొండ కాయలను వాడి మనం షుగర్ వ్యాధి నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
0 Comments:
Post a Comment