పాఠశాల అడ్మిషన్లలో ఆధార్‌ను తప్పనిసరి చేయలేమని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, చాలా పాఠశాలలు ఇప్పటికీ ప్రవేశ సమయంలో పిల్లల ఆధార్ కార్డ్ అవసరం అంటూ చెబుతున్నాయి.
పాఠశాల అడ్మిషన్లలో తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫారమ్‌లను పూరించడం నుండి, అడ్మిషన్ లిస్ట్‌లో కనిపించే పేర్ల కోసం వేచి ఉండటం వరకు చిన్నారుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
ఇక అన్ని చోట్ల ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి యూనిక్ ఐడెండిటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
భారత దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా 12-అంకెల, బయోమెట్రిక్ ఆధారిత, ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన ఆధార్‌ను యూఐడీఏఐ జారీ చేస్తుంది. నవజాత శిశువుతో సహా ఏ వయసులోనైనా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉంటే ఎన్నో అంశాలలో గుర్తింపు కార్డుగా ఇది ఉపయోగపడుతుంది. అయితే పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆధార్ ఇవ్వాల్సిన పని లేదని యూఐడీఏఐ చెబుతోంది.
సీబీఎస్ఈ, నీట్, యూజీసీ నిర్వహించే పరీక్షలకు సైతం ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ పేర్కొంది.
ఏదైనా విద్యాసంస్థలు ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలని పట్టుబడితే వారిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ చేయించరు.
అలాంటి చిన్నారులకు ఆధార్ నమోదు ప్రక్రియను పాఠశాలలే చేపట్టానే నిబంధనను యూఐడీఏఐ పొందుపర్చింది. ఆధార్ పొందుపర్చిన 12ఏ నిబంధనలో ఈ విషయం స్పష్టంగా పేర్కొనబడింది.
ఇక పరీక్షలు రాయడానికి, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి, కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి ఆధార్ తప్పనిసరి కాదు.
దీనిని విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలి. తప్పనిసరి చేస్తే అది నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
0 Comments:
Post a Comment