✍️డీఎస్సీ-98 అభ్యర్థులకు త్వరలో పోస్టింగులు
🌻ఈనాడు, అమరావతి: డీఎస్సీ-98 అభ్యర్థులకు త్వరలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,567 మంది వరకు అర్హులున్నట్లు అధికారులు జాబితా రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే నియామకాలకు సంబంధించిన కసరత్తు చేపట్టనున్నారు. డీఎస్సీ-98 దస్త్రానికి సీఎం ఆమోదం తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఉత్త ర్వులివ్వాల్సి ఉంది. కొత్త పీఆర్సీ ప్రకారం ఒప్పంద ఉపాధ్యాయులకు రూ.33,670 వేతనం అందనుంది. ఏడాదికి 10నెలలు మాత్రమే ఇస్తారు. రెగ్యులర్ వారికి వర్తించే సెలవులు వీరికి ఉంటాయి.
0 Comments:
Post a Comment