7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - కేంద్రం నిర్ణయంతో ఒక్కటి కాదు మూడు ప్రయోజనాలు !
Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కటి కాదు మూడు శుభవార్తలు. జూలై నెలలో వీరు మూడు రకాల ప్రయోజనాలు పొందనున్నారు. అందులో ఒకటి డియర్ నెస్ అలవెన్స్ పెంపు (Dearness Allowance), రెండో అంశం ఏంటంటే..
గత 18 నెలలకు సంబంధించిన పెండింగ్ డీఏ బకాయిలు పొందడం, చివరగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.
డియర్నెస్ అలవెన్స్‌పై నిర్ణయం
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ఉద్యోగులకు డీఏను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల నుంచి ఉద్యోగులు సవరించనున్న డీఏ అందుకుంటారని సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. డియర్నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతారని గతంలో భావించారు. అయితే 5 శాతం పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెల ఏఐసీపీ ఇండెక్స్ (ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచిక) ఇందుకు కీలకంగా మారనుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచితే సవరించిన డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. ఒకవేళ ఉద్యోగులకు 5 శాతం ఇస్తే మొత్తం డీఏ 39 శాతం అవుతుంది.
ఉద్యోగుల డీఏ బకాయిల చెల్లంపులు
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా వచ్చే నెలలో డీఏ పెంపుతో పాటు బకాయి డీఏను సైతం ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అందించే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతున్న డీఏ బకాయిలు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏలను ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుందని వారు ధీమాగా ఉన్నారు. కాగా, 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు.
ఈపీఎఫ్ వడ్డీ జమ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు, డీఏ బకాయిలతో పాటు పీఎఫ్ వడ్డీని త్వరలో అందుకోనున్నారు. 2021-22 ఏడాదికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీని ఖాతాల్లో జమ చేసే ఛాన్స్ ఉంది. గతంలో 8.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.10 శాతానికి తగ్గించారు. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఇకనుంచి తక్కువశాతం వడ్డీని పొందుతారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.79 శాతానికి పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు తగ్గించడంతో కోట్లాది ఈపీఎఫ్ ఖాతాదారులు నష్టపోతారు.
0 Comments:
Post a Comment