Water Apple: వేసవి కాలం వచ్చిందంటే చాలు రకరకాల. పండ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. ఈ వాటర్ ఆపిల్ ను రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు.నిజానికి ఈ పండు గురించి చాలా మందికి తెలియదు.
కాని ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది .ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి చాలా రకాల పోషకాలు మెండుగా ఉన్నాయి.
వాటర్ ఆపిల్ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.వీటితో పాటుగా వాటర్ ఆపిల్ లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
Many Health Secrets You Didn’t Know About Water Apple …!
Read the latest news from NEWSORBIT
Follow us on facebook , Twitter , instagram and Googlenews
Water Apple: వాటర్ ఆపిల్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో :
ఇన్నీ పోషకాలు ఉన్న వాటర్ ఆపిల్ ను తినడం వలన ఎర్ర రక్త కణాలు సంఖ్య పెరగడంతో పాటుగా, శరీరంలోని ఎముకలు,కీళ్లు బలంగా తయారవుతాయి.అలాగే కండరాల తిమ్మిరి కూడా తగ్గుతుంది.
ఈ వాటర్ ఆపిల్ తినడానికి తియ్యగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ వాటర్ ఆపిల్ ను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండ్లలో హైడ్రేటింగ్ గుణం ఉంటుంది. అలాగే నోట్లోవేసుకోగానో ఇట్టే కరిగిపోతుంది.ఈ వేసవి కాలంలో ఎండ వేడిమిని తట్టుకుని,దాహాన్ని తగ్గించడంలో వాటర్ యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో వాటర్ ఆపిల్ పాత్ర :
ఈ పండులో ప్రొటీన్లు, డైటరీ ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఫలితంగా మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం,విరేచనాలు,జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తుంది.
అలాగే ఈ పండు తినడం వలన శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ కరిగిపోయి బరువు తగ్గుతారు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్థులకు ఈ వాటర్ ఆపిల్ ఒక. మంచి మందు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.
Many Health Secrets You Didn’t Know About Water Apple …!
షుగర్ వ్యాధి గ్రస్థులకు వాటర్ ఆపిల్ ఒక వరం :
ఎందుకంటే ఇందులో ఉండే “జాంబోసిన్ “అనే ఒక రకమైన ఆల్కలాయిడ్ పిండి పదార్ధాలను చెక్కరగా మార్చకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.!ఇంతే కాకుండా వాటర్ యాపిల్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి కావున క్యాన్సర్,రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు, మెదడుకు సంబందించిన ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఈ పండు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది.చూసారు కదా వాటర్ ఆపిల్ తినడం వలన ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాటర్ ఆపిల్ ఎక్కడ కనిపించినాగాని వదలకండి.!
0 Comments:
Post a Comment