Viral - అది ప్రపంచంలోనే ఏకైక వింత చెట్టు.. ఏడాదిలో రెండు రోజులు ఏం జరుగుతుందంటే..
పర్వతాలు, రాళ్ల మధ్యనే జలపాతం పుడుతుందని ఎవరు మీకు చెప్పారు? మోంటెనెగ్రో దేశ రాజధాని పోడ్‌గోర్సియా నుండి ఐదు కి.మీ.ల దూరంలో ఉన్న డైనోసా (పోడ్‌గోరికా) అనే ప్రదేశంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది.
ఇక్కడి ఒక మల్బరీ చెట్టు వింతలకు కేంద్రంగా నిలిచింది. యూరో న్యూస్ నివేదిక ప్రకారం, ఇది ప్రపంచంలోని అద్భుత చెట్టు అని స్థానికులు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి చెట్టు మరొకటి లేదు. ఇంతకీ ఈ చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం చలికాలం చివరిలో ఈ చెట్టు నుండి జలపాతంలోని ధారలా నీరు కిందికి ఉబికివస్తుంది. ఈ మల్బరీ చెట్టులో నీటి బుగ్గ ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి, కానీ అలాంటి సంఘటన కేవలం 150 సంవత్సరాల మల్బరీ చెట్టులో మాత్రమే కనిపించింది. యూరో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చెట్టు మూలానికి నేరుగా నీటి చెలమ అనుసంధానమై ఉందని... ఇదే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా భూమిలోని నీరు తన దారిని వెతుక్కుంటూ నేరుగా చెట్ల గుండా వెళుతుంది. మంచు కరగడం లేదా అధిక వర్షం కారణంగా భూమిలోని నీటి మట్టం పెరుగుతుంది. అక్కడ ఒత్తిడి పెరిగిన కారణంగా నీరు చెట్టులోని బోలు కాండం నుంచి బయటకు వస్తున్నది. ఈ వింతను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి స్థానికులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. BBC నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ఈ చెట్టు నుండి నీరు వస్తుంది. ఇది శీతాకాలంలో మాత్రమే జరుగుతుంది. ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ చెట్టు నుండి ఏడాది పొడవునా నీరు బయటకు రాదు. నీరు బయటకు వచ్చినప్పుడల్లా ఇది ఆకర్షణకు కేంద్రంగా మారుతుంది. కాగా మాంటెనెగ్రో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కూడా చెట్టు నుండి నీరు వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. చెట్టు కాండం నుంచి నీరు రావడాన్ని స్థానికులు చూశారు. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే మాంటెనెగ్రోతో పోలిస్తే ఈ రెండు సంఘటనలు పూర్తిగా భిన్నమైనవి. రెండింటిలోనూ జలపాతంలా నీరు బయటకు ప్రవహించ లేదు.
0 Comments:
Post a Comment