Vastu Tips: డబ్బు లెక్కించేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి.. రూపాయి కూడా మిగలదట
హిందూశాస్త్రాల ప్రకారం...
శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీ దేవిని పూజిస్తే సంపంద, కీర్తి పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటే ఆ ఫ్యామిలీకి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రావు. పేదరికం వారి దరిచేరదు.
ఒకవేళ లక్ష్మీ దేవికి కోపం వస్తే ఆ ఇంటికి పేదరికం రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాంటప్పుడే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటప్పుడు.. తప్పు ఎక్కడ జరిగిందో మనకు అర్ధం కాదు. ఎంతో కష్టపడినా డబ్బు రావు. వచ్చినా.. నిలవదు. వెంటనే ఖర్చయిపోతుంది.
చేతిలో డబ్బు నిలవకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. మనం నిత్యం డబ్బుతో ఏదో ఒక పనిచేస్తుంటాం. ఆ సమయంలో మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. అలా చేయడం వల్లే లక్ష్మీ దేవికి కోపం వచ్చి.. ఆర్థిక కష్టాలు వస్తాయట. అందుకే డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.
పర్స్‌లో కరెన్సీ నోట్లు, నాణేలతో పాటు ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచకూడదు. కొందరు చాక్లెట్స్, సోంపు వంటి పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డబ్బుకు అవమానం జరుగుతుందట. అలాంటప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుందట.
మీరు ఎవరైనా పేదవారు, యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు.. నోట్లను గానీ, నాణేలను గానీ విసిరేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మి దేవిని అవమానించినట్లే, అందుకే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు విసిరి వేయకుండా.. వారి చేతికి అందివ్వాలి.
కొందరు నోట్లను లెక్కబెట్టే సమయంలో.. పదే పదే చేతి వేళ్లను నోట్లోపెట్టుకుంటారు. వేలిని ఉమ్ముతో తడిచేసి.. ఆ తర్వాత లెక్కపెడతారు. కానీ ఇలా చేయకూడదు. నోట్లను లెక్కించేటప్పుడు ఉమ్ముకు బదులు.. నీరు లేదా ఏదైనా పొడిని ఉపయోగించడం శ్రేయస్కరం.
రాత్రి నిద్రించే సమయంలో మంచంపై డబ్బులు ఉంచకూడదు. నగదును ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశాల్లోనే ఉంచాలి. చిన్న మొత్తమైతే పర్సుల్లో.. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే.. అల్మారాలో ఉంచాలి. అంతేగానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.
హిందూ మతం విశ్వాసాల ప్రకారం... డబ్బులోనే లక్ష్మి దేవి నివసిస్తుంది. అందుకే నేలపై పడిన డబ్బును తీసుకునేటప్పుడు.. ముందుగా నుదుటికి ఆనించి.. మనసులో లక్ష్మీ దేవతను స్మరించుకోవాలి. ఆ తర్వాతే పర్సు గానీ, అల్మారాలోగానీ పెట్టాలి.
0 Comments:
Post a Comment