Vastu tips: మన దేశంలోని ఆచార వ్యవహారాల్లో ఇలాంటివి ఎన్నో మన పెద్దల నుంచి వింటూనే ఉంటాం. ఈ విషయాలు వినడానికి ఏ విధమైన అర్ధవంతం అనిపించవు, కానీ ఇప్పటికీ శతాబ్దాలుగా వాటిని నమ్ముతున్నారు.
చాలా మంది ఈ విషయాలను మూఢనమ్మకాలుగా భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం (Vastu shastra) ప్రకారం కొన్ని విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు వేడి పెనం (Pan) మీద నీరు పోయకూడదు.
నమ్మకం ప్రకారం, లక్ష్మీ దేవి మన వంటగదిలో నివసిస్తుంది అందుకే పాత కాలంనాటి నుంచి వంటగదిలో కొన్ని పనులు చేయడానికి నిరాకరిస్తాం.
వేడి పాన్ మీద ఎందుకు నీరు పోయకూడదు?
వాస్తు శాస్త్రం ప్రకారం వేడి పాన్ మీద నీరు పోయడం వల్ల వచ్చే శబ్దం జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. దీంతో పాటు వేడి పెనం మీద నీరు పోయడం వల్ల ఇంట్లోని వారి వైవాహిక జీవితం లేదా ఇంటి సభ్యుల ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైపోతుందని నమ్ముతారు.
సరైన స్థలంలో పెట్టాలి..
ఇది రాహువును సూచిస్తుందని నమ్ముతారు. అందుకే ఇంట్లో పెనం ఎప్పుడు వాడినా శుభ్రం చేసిన తర్వాతే ఉంచాలి. కొందరు పెనం వాడిన తర్వాత అలాగే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యలు రావచ్చు.
జాతకంలో రాహు దోషం కూడా రావచ్చు. వంట గదిలో ఎల్లప్పుడూ బయటి వ్యక్తుల కళ్లు నేరుగా పెనంపై పడకుండా ఉండే చోట పెట్టాలి. భారతీయ గ్రంథాల ప్రకారం ఇంట్లోని సభ్యులే కాకుండా పెనంపై బయటి వ్యక్తులు ఎవరూ కూడా కనిపించకూడదు.
ఉప్పు..
ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపమని నమ్ముతారు. కాబట్టి ఎల్లప్పుడూ చపాతీలు చేయడానికి ముందు పెనం మీద ఉప్పు చల్లాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. దీనితో పాటు ఉప్పును చిలకరించడం వల్ల పెనం క్రిమిరహితంగా మారుతుంది.
తలకిందులుగా ఉంచకూడదు..
ఇంట్లో చపాతీలు చేసిన తర్వాత పెనం ఎప్పుడూ తలకిందులుగా ఉంచకూడదు లేదా పడుకోబెట్టకూడదు అని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల రాహువు దోషం ,మీ ఇంట్లో రకరకాల కష్టాలు రావచ్చు.
0 Comments:
Post a Comment