భారతదేశం (India)లో ఎండలు (Heat) మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే వారాల్లో మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉంది.
వేసవి కారణంగా సహజంగానే దేశంలో ఎయిర్ కండీషనర్లకు(Air conditioners) విపరీతమైన డిమాండ్ ఉంది.
అయితే Amazon, Flipkart, ఇతర ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ల నుంచి ఆన్‌లైన్‌లో ఎయిర్ కండీషనర్(AC)ని కొనుగోలు చేయడానికి ముందు (Before buying) కొన్ని అంశాలను తెలుసుకోవడం అవసరం.
AC ఇన్‌స్టాలేషన్, స్ప్లిట్ లేదా విండో AC మోడల్‌లు, టన్నేజ్ లేదా ఎక్కువ కూలింగ్ కెపాసిటీ వంటివి తెలుసుకోవాలి.
ప్రస్తుతం అవసరాలు, కండిషన్, స్థలానికి సరిపోయే వివిధ రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇవి విలాసవంతమైనవిగా కనిపించేవి.
ఇప్పుడు తక్కువ ధరలకు, ఉత్తమ ఫీచర్ల (Best features)తో లభిస్తున్నాయి. కాబట్టి కొత్త ACని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ విషయాలు తెలుసుకోండి.
* స్ప్లిట్ ఏసీ, విండో ఏసీలో ఏది కొనుగోలు చేయాలి?
విండో ACని సులభంగా ఇన్‌స్టాలేషన్ చేయవచ్చు. దీనికి సర్వీసింగ్ ఖర్చు (Servicing cost) తక్కువ. శబ్ధం ఎక్కువ. దీనికి విండో లేదా 1, 1.5, 2 టన్నుల మోడళ్లను భరించే పటిష్ఠమైన ప్రాంతం అవసరం.
విండో AC మోడల్ అన్ని భాగాలను కలిగి పెద్దదిగా ఉంటుంది. చౌకగా లభిస్తుంది. విండో ACని ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. దీని నుంచి శబ్ధం ఎక్కువగా వస్తుంది.
స్ప్లిట్ AC.. తక్కువ శబ్దం, ఎక్కువ ఖర్చు
స్ప్లిట్ AC పెద్ద పరిమాణంలో ఉన్న గది (Room)లో సమర్థవంతమైన చల్లదనాన్ని అందిస్తుంది. స్ప్లిట్ భాగం కంప్రెసర్, హీట్ డిస్పెన్సింగ్ కాయిల్స్ ఇంటర్నల్, ఎక్స్‌టెర్నల్‌గా యూనిట్‌గా వేరు చేస్తాయి.
స్ప్లిట్ AC ఉన్న ఇళ్లలో గమనిస్తే.. బయటకు కనిపించే భాగం వేడిని బయటకు పంపుతుంది.
* 1 టన్ లేదా 1.5 టన్ను కూలింగ్ కెపాసిటీ AC: ఏ మోడల్‌ని కొనుగోలు చేయాలి?
గది పరిమాణం, స్థాయిని బట్టి ఏసీ కెపాసిటీ అవసరం. ఎందుకంటే గదిలో చల్లదనం కలిగించడం ఆ గదిలో ఎంత సూర్యరశ్మి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇల్లు/గది కోసం భారీ సామర్థ్యం గల AC అవసరం లేదు. ACలు 1 టన్ను, 1.5 టన్ను, 2 టన్ను సామర్థ్యాలలో వస్తాయి. భారతదేశంలోని చాలా గృహాలకు 1.5 టన్ను AC సరిపోతుంది.
* AC ఎలక్ట్రిసిటీ బిల్లు
ఎయిర్ కండీషనర్ల (Air conditioners) వినియోగం వల్ల ఎక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది. AC మోడల్‌ల ముందు కనిపించే స్టార్ రేటింగ్‌ల వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఈ స్టార్స్.. ఎయిర్ కండీషనర్ ఎంత పవర్‌ను వినియోగిస్తుందనేది తెలియజేస్తుంది.
ఎక్కువ ర్యాంకింగ్ ఉన్నవాటిని కొనుగోలు చేయడం మంచిది. మొత్తం 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. బెస్ట్ ర్యాంక్ ఉన్న AC ధర ఎక్కువగా ఉంటుంది.
* ఇన్వర్టర్ ఏసీ లేదా నాన్-ఇన్వర్టర్ ఏసీ మోడల్?
ఇన్వర్టర్ ట్యాగ్‌తో ఈ రోజుల్లో చాలా ఏసీలను చూసి ఉండవచ్చు. ఇన్వర్టర్‌ను కొనుగోలు చేస్తే AC మోడల్ చల్లదనాన్ని కంట్రోల్ చేసుకొనే వీలు కూడా ఉంటుంది.
విద్యుత్ బిల్లులను ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు 1.5 టన్ను ఇన్వర్టర్ ACని కొనుగోలు చేస్తే, ఈ మోడల్ బయట ఉష్ణోగ్రతను బట్టి 0.5 టన్ను, 1.5 టన్ను శీతలీకరణ సామర్థ్యం మధ్య పని చేయగలదు. 1.5 టన్ను నాన్-ఇన్వర్టర్ మోడల్‌ని కొనుగోలు చేస్తే, ఈ AC మోడల్ ఎల్లప్పుడూ 1.5 టన్ను శీతలీకరణ సామర్థ్యంతో పని చేస్తుంది.
* AC విత్ ఎయిర్ ఫిల్టర్
ఎయిర్ కండీషనర్ (Air conditioners) అన్ని పరిమాణాలలోని బ్యాక్టీరియా, ధూళి కణాల నుండి రక్షణను అందిస్తుందా లేదా చూసుకోవాలి. AC, దాని ఫిల్టర్ ప్లాన్డ్ ప్రివెంటివ్ మెయిన్‌టెనెన్స్(PPM) వ్యవస్థను కలిగి ఉంటే ప్రభావవంతంగా ఉంటాయి.
ఇది కాంపోనెంట్ రిపేర్‌లను అదుపులో ఉంచడమే కాకుండా, బ్యాక్టీరియా, ధూళి నుంచి రక్షణ కల్పిస్తుంది.
* ఆన్‌లైన్‌లో ఏసీని కొనుగోలు చేయడం?
ఆన్‌లైన్‌లో భారీ వస్తువును కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్‌లు, రాయితీ లభిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేసే సౌలభ్యం వచ్చింది. ఆన్‌లైన్‌లో కొనేముందు గుర్తించుకోవాల్సిన అంశాలివే..
* AC బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌తో AC మోడల్ ఫీచర్స్ క్రాస్-చెక్ చేయండి
ఆన్‌లైన్‌లో ఏసీలను థర్డ్-పార్టీ స్టోర్‌ల నుండి పొందుతారు. కాబట్టి కంపెనీ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్‌ను తనిఖీ చేయడం ద్వారా రెండూ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు.
ఎందుకంటే ఆన్‌లైన్ స్టోర్ మీకు పాతదాన్ని అందించే అవకాశం ఉంది. కంపెనీ వెబ్‌సైట్‌లో కొత్తది ఉంటుంది. ధర, ఫీచర్లు చెక్ చేసుకోవచ్చు.
* ఏసీ డెలివరీ, ఇన్‌స్టాలేషన్ డీల్‌లో భాగమేనా?
సౌలభ్యం కారణంగా ఆన్‌లైన్ కొనుగోళ్లకు ప్రాధాన్యం పెరిగింది. ఏసీ డెలివరీ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇన్‌స్టలేషన్, డెలివరీ సదుపాయాలను సెల్లర్ కల్పిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకోవాలి. లేదంటే వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
0 Comments:
Post a Comment