Throat pain remedies: గొంతు నొప్పి రెగ్యులర్గా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ చిట్కాలు పాటించండి..
సరైన ఆహారం (good food) కూడా తీసుకోకపోవడం దీనికి మరో కారణం. కల్తీ ఆహారం కూడా కారణమే. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం (health) ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది.
అందుకే ఎలాంటి ఆహారాలు దేనికి మంచివి అనేవి తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి (Sore throat pain) వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు (Throat pain remedies) ఒకసారి తెలుసుకుందాం..
మిరియాలు (Pepper), బాదంపప్పును (Almonds) కలిపి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి సేవించడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలను తాగండి. గొంతు నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది. మీకు గొంతు నొప్పి చాలా ఇబ్బందిని కలిగిస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ (Infection), మంట చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజసిద్దమైన ఔషధాలతో కషాయాన్ని (Infusion) తయారు చేసుకుని సేవిస్తే సరిపోతుంది. గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పిని తగ్గించే కషాయాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని చిటికెడు పసుపు (Turmeric), ఒక స్పూన్ ఉప్పు (Salt) వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా (Lukewarm) ఉన్నప్పుడు నోటిలోనికి తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి. లేదా అల్లంలో (Ginger) ఎన్నో ఔషధగుణాలున్నాయి. గొంతు నొప్పి నుంచి తక్షణ విముక్తి కోసం అల్లం వాడటం మంచిది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడగట్టి ఒక గ్లాసు తీసుకోని ఒక స్పూన్ తేనె (Honey) కలిపి తాగాలి. ఇలా చేయడంతో గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది.
0 Comments:
Post a Comment