Number of children by officers exercise section for school merger
🌼పాఠశాలల విలీనానికి అధికారుల కసరత్తు సెక్షన్లవారీగా పిల్లల సంఖ్య
✳️3 నుంచి 5 తరగతుల వరకు 45 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్, 45 నుంచి 75 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 75 నుంచి 104 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 105 నుంచి 134 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 135 నుంచి 164 వరకు విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 165 నుంచి 194 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 6 నుంచి 8వ తరగతి వరకు 52 మంది విద్యార్థుల్లోపు ఉంటే ఒక సెక్షన్, 53 నుంచి 87 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 88 నుంచి 122 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 123 నుంచి 157 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 158 నుంచి 192 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 183 నుంచి 227 మంది విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 9 నుంచి 10 తరగతులకు సంబంధించి 60 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్, 61 నుంచి 99 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 100 నుంచి 139 మంది వరకు విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 140 నుంచి 179 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 180 నుంచి 219 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 180 నుంచి 259 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
✳️3 నుంచి 5 తరగతుల వరకు 375 మంది నుంచి 404 వరకు పిల్లలున్నా, 6 నుంచి 8 తరగతులకు 438 నుంచి 472 మంది పిల్లలున్నా, 9, 10 తరగతులకు 500 నుంచి 539 మంది పిల్లలున్నా 13 సెక్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.
0 Comments:
Post a Comment