SBI SCO Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు..అర్హులెవరంటే..
SBI Specialist Cadre Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల (Specialist Cadre Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు పోస్టులు
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులు
విభాగాలు: ఐటీ (టెక్నికల్ ఆపరేషన్స్, ఇన్‌బౌండ్ ఇంజినీర్, ఔట్‌బౌండ్ ఇంజినీర్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్, నెట్వర్క్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్, స్టాటిస్టీషియన్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: నోటిఫికేషన్లో సూచించిన విధంగా పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.750
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2022.
0 Comments:
Post a Comment