✍️పీఆర్సీ ఉత్తర్వులు ఇంకెప్పుడు?
అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*: పిఆర్సి ఆందోళన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కూడిన స్టీరింగ్ కమిటీతో చేసుకున్న ఒప్పందాలు మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తుండగా ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పిఆర్సిలో న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరిమూడో తేదీన ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం అనంతరం ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చించింది. మొత్తం 17 అంశాలపై ఒప్పందం చేసుకుంది. వాటిల్లో సిపిఎస్ కూడా ప్రధాన అంశంగా ఉంది. సిపిఎస్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా జిపిఎస్్ను తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనూ ఉద్యోగ సంఘాల నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సీపీఎస్ స్థానంలో జిపిఎస్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవా లంటూ ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. దీంతో సిపిఎస్ వ్యవహరం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ప్రధానంగా పిఆర్సిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా 10 ఏళ్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్ల కు మారుస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన చర్చ ల్లో హామీ ఇచ్చారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పిఆర్సికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇచ్చిన హామీల్లో నివేదికను బయటపెట్టడం, హెచ్ఐర్ఎ, సిపిఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్యలపై ఉత ర్వులు ఇచ్చారు. ఇచ్చిన పిఆర్సి హామీల ఉత్తర్వులు విడుదల చేయకపోతే మరో ఉద్యమం తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పిఆర్సి హామీల ఉత్తర్వులు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
0 Comments:
Post a Comment