దిశ, వెబ్డెస్క్: చాలా మందికి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తుంటాయి.బయట ఎండల వల్ల చర్మం కూడా బాగా నల్లపడిపోయి, కంటి కింద నల్లటి మచ్చలు కూడా ఏర్పడతాయి.
బంగాళదుంలో కాటలేజ్ ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. కంటి కింద నల్లటి వలయాలను, ముడతలను పోగొట్టేందుకు బంగాళదుంప ఎంతో ఉపయోగపడుతుంది.
* బంగాళదుంపలోని పోషకాలు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. బంగాళదుంప ముక్కలను గుండ్రంగా కోసి నీళల్లో 10 నిమిషాలు నానపెట్టాలి. తర్వాత వాటిని తీసుకుని ముఖానికి రుద్దుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
* బంగాళదుంప గుజ్జు, నాలుగు స్పూన్ల యాపిల్ గుజ్జు ఈ రెండు మిశ్రమాలను కలిపి ముఖానికి అప్లే చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా తరుచు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోతాయి.
* కీరదోస గుజ్జు, బంగాళదుంప గుజ్జు పావుకప్పు తీసుకుని ముఖానికి ప్యాక్ల వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
* కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించుకునేందుకు బంగాళదుంపను వలయాకారంగా ముక్కలు కోయాలి. వాటిని కళ్లపై పావుగంట ఉంచి గోరు వెచ్చని నీళ్లతో శభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది.
* బంగాళ దుంప రసం, నిమ్మరసం, ముల్తానీ మట్టి ఈ మూడు మిశ్రమాలను రెండు స్ఫూన్ల చొప్పున తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది.
0 Comments:
Post a Comment