PM-KISAN 11th Instalment: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఆ రోజే.. ప్రకటించిన నడ్డా..!
PM KISAN Samman Nidhi Yojana: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) ఒకటి.
PM Kisan Funds: అన్నదాతలకు గుడ్ న్యూస్. 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( PM Kisan Samman Nidhi Yogana) నిధులు విడదలయ్యాయి.
హిమాచల్ ప్రదేశలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో పీఎం సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. తర్వాత 16 మంది లబ్దిదారులతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి.. మీకు ఎలాంటి ఉపయోగం కల్గింది.. మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా... వంటి ప్రశ్నలను అడిగారు మోడీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఉజ్వల , వయ వందన యోజన, స్వచ్చ్ భారత్, స్వనిధి యోజన, వన్ నేషన్ వన్ రేషన్, గరీబ్ కల్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్రా యోజన పథకాల లబ్ధిదారులతోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.
దేశంలోని 10 కోట్ల మంది అన్నదాతల ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయలు జమ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్) పథంలో కింద అన్నదాతకు పెట్టుబడి సాయం కింద ఏటా 6 వేల రూపాయలు ఇస్తుంది మోడీ సర్కార్. ఏడాదిలో మూడు సార్లు.. 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 10 వాయిదాల్లో రైతులకు డబ్బులు విడుదల చేశారు. 11వ విడత నిధులు ఇప్పటికే ఇవ్వాల్సి ఉన్నా.. ఈ-కేవైసీ సమస్యలతో ఆలస్యమైంది. లబ్దిదారుల నుంచి మళ్లీ ఈకేవైవీ తీసుకున్నారు. లక్షలాది మంది ఫేక్ లబ్దిదారులను తొలగించారు.
ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పెంపు..
📲eKYC is MANDATORY for PMKISAN Registered Farmers
👉PM Kisan : ఈ - కేవైసీ తప్పనిసరి .. ఇలా నమోదు చేసుకోండి..
👉మనం మన ఫోన్ లోనే eKYC ఇలా చేయొచ్చు...వివరాలు..
https://www.mannamweb.com/2022/05/ekyc-is-mandatory-for-pmkisan.html
మరోవైపు పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. 11వ వాయిదా డబ్బును పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అయితే సాంకేతిక సమస్యతో చాలామంది లబ్దిదారుల ఈ-కేవైసీ పూర్తి కాలేదు. దేశ వ్యాప్తంగా 11.22 కోట్ల మంది లబ్దిదారులు ఉండగా.. ఇప్పటివరకు 50 శాతం మంది మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. దీంతో పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ కోసం గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర సర్కార్.
మీ ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయో లేదో ఇలా చేక్ చేసుకోండి..
1. పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in లో లాగిన్ కావాలి
2. రైట్ సైడ్ ఉన్న బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి
3. ఆధార్ లేదా ఖాతా నెంబరు ఎంటర్ చేసి 'గెట్ డేటా' బటన్ నొక్కాలి
4. స్క్రీన్‌పై స్టేటస్ కనిపిస్తుంది. ఈ-కేవైసీ పూర్తైతే మీ అకౌంట్ లో నగదు జమవుతుంది
5. బెనిఫిషియరీ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవచ్చు
ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ ద్వారా ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.
ఎవరు ప్రయోజనం పొందుతారు
ఈ పథకం ప్రయోజనం సాగు కోసం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇతర రకాల ప్రభుత్వ పెన్షన్‌ల ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీనితో పాటు, కుటుంబంలో భార్య లేదా భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి డబ్బులు వస్తున్నట్లయితే అనర్హులు.
💰PM కిసాన్ డబ్బులు రేపు లబ్ధిదారుల అకౌంట్ లో పడనున్నాయి ఎంత డబ్బులు పడతాయి ఎన్ని విడతలుగా..పూర్తి వివరాలు... 📑 లబ్ధిదారుల జాబితా🔍 Check Payment Status 👉డబ్బులు పడకపోతే ఏం చేయాలో వివరణ
https://www.mannamweb.com/2020/04/pm-kisan-samman-nidhi-yojana.html
💰PRIME MINISTER - KISAN SAMMAN NIDHI - Ckeck the Instalment Amount Credited or not in your Account ?
https://www.mannamweb.com/2019/10/prime-minister-kisan-samman-nidhi-ckeck.html
0 Comments:
Post a Comment