Palakova : మనం ప్రతిరోజూ పాలను ఆహారంలో భాగంగా తాగుతూ ఉంటాం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు కూడా ఒకటి.
పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు.
ప్రతిరోజూ పాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దంతాలు గట్టి పడతాయి. బరువు తగ్గడంలో పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలోనూ పాలు ఉపయోగపడతాయి.
చర్మం కాంతివంతంగా మారుతుంది. పిల్లలను చురుకుగా ఉంచడంలో వారిలో ఎదుగుదలను పెంచడంలో కూడా పాలు సహాయపడతాయి. చాలా మంది పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు పాలను కాచేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి. పాలు విరిగిపోయాయి కదా అని వాటిని పారబోయకుండా వాటితో మనం పచ్చికోవాను తయారు చేసుకోవచ్చు.
విరిగిపోయిన పాలతో చేసే పచ్చి కోవా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చి కోవాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Palakova
ముందుగా విరిగిపోయిన పాలలో ఉండే నీటిని పారబోసి పాల విరుగుడును అలాగే గిన్నెలో ఉంచి కలుపుతూ చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేడి చేయాలి.
5 నిమిషాల తరువాత రుచికి తగినంత పంచదారను వేసి పంచదార కరిగే వరకు తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి కోవా తయారవుతుంది.
దీనిని నేరుగా తినవచ్చు లేదా ఇతర తీపి పదార్థాల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.
విరిగిపోయిన పాలను పారబోయకుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పచ్చి కోవాను తయారు చేసుకుని తినవచ్చు.
పాలలో ఉండే పోషకాలు కూడా పచ్చి కోవాలో ఉంటాయి. కనుక దీనిని తినడం వల్ల కూడా పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.
0 Comments:
Post a Comment