1. మీ దగ్గర పాత నోట్లు (Old Notes) ఉన్నాయా?
చిరిగిన నోట్లు బీరువాలో అలాగే దాచేశారా? వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చు. మార్కెట్లో లేదా బస్సులో చిరిగిన నోట్లు వస్తే వాటిని ఎలాగోలా మళ్లీ మార్చెయ్యాలని చూస్తుంటారు.
ఆ నోట్లు తమ దగ్గరే పెట్టుకుంటే వాటికి విలువ ఉండదేమోనని భ్రమ పడుతుంటారు. కరెన్సీ నోట్లు (Currency Notes) చిరిగినా దాని విలువ చెక్కుచెదరదు.
2. కాబట్టి వాటిని మార్చుకోవచ్చు. అయితే మీకు వచ్చిన చిరిగిన నోటును మీరు మరొకరికి ఇస్తే వాళ్లు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటారు. అందుకే అలాంటి కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం ఉత్తమం.
చాలాకాలం క్రితం ముద్రించిన కరెన్సీ నోట్లు పాతబడి చిరిగిపోతుంటాయి. కొత్త నోట్లు కూడా పొరపాటున చిరిగిపోతుంటాయి. వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చు.
3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమనిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను, పాత నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. మురికిగా మారిన, చిరిగిన నోట్లను బ్యాంకులో ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చు.
చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవాలని, కరెన్సీ నోట్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యూట్యూబ్ ఛానెల్ ద్వారా అవగాహన కల్పిస్తోంది ఆర్బీఐ.
4. కరెన్సీ నోట్లు ముక్కలైతే వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. వాటి నెంబర్లు కనిపిస్తే చాలు. కరెన్సీ నోటులో కొంత భాగం లేకపోయినా వాటిని మార్చుకునే వీలుంటుంది.
కరెన్సీ నోటులో ముఖ్యమైన భాగాలైన ఇష్యూయింగ్ అథారిటీ పేరు, గ్యారెంటీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం చిహ్నం, మహాత్మా గాంధీ చిత్రపటం, వాటర్ మార్క్ లాంటివి లేకపోయినా ఆ నోట్లను మార్చొచ్చు.
5. ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో వీటిని మార్చుకోవచ్చు. ఆర్బీఐ సూచించిన నోట్ రీఫండ్ నియమనిబంధనల ప్రకారం రీఫండ్ లభిస్తుంది.
పాత కరెన్సీ నోట్లు, చిరిగిన నోట్లు మార్చడానికి ఎలాంటి ఫామ్ పూర్తి చేయాల్సిన అవసరం కూడా లేదు.
6. అయితే అన్ని కరెన్సీ నోట్లు బ్యాంకులో మార్చుకోవడానికి కుదరదు. ఎక్కువగా పాడైన నోట్లు, కాలిపోయిన నోట్లను ఆర్బీఐ కార్యాలయంలోనే మార్చుకోవాల్సి ఉంటుంది. కరెన్సీ నోట్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
7. కరెన్సీ నోట్లు పర్సులో పెట్టుకున్నప్పుడు లేదా జేబులో దాచుకున్నప్పుడు చిరిగిపోకుండా చూడాలి. కరెన్సీ నోట్లు జేబులోనే పెట్టి బట్టలు ఉతికినా నోట్లు తడిసిపోయి పాడవుతాయి. కరెన్సీ నోట్లపై ఏమీ రాయకూడదు. కరెన్సీ నోట్లకు రంగులు అంటకుండా చూడాలి.
0 Comments:
Post a Comment