భారతదేశంలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు (IPO) కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకొన్ని గంటల్లో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
మే 4 నుంచి మే 9 వరకు ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ (LIC IPO Subscription) కొనసాగనుంది. రూ.20,557 కోట్ల ఇష్యూతో ఎల్ఐసీ ఐపీఓ రికార్డులు సృష్టించబోతోంది.
అంతకన్నా ముందు రూ.18,300 కోట్ల ఐపీఓతో పేటీఎం ఐపీఓ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన భారీ ఐపీఓల్లో ఎల్ఐసీ మొదటి స్థానంలో ఉండబోతోంది.
మరి మీరు కూడా ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎల్ఐసీ ఐపీఓకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
LIC IPO Dates: ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది.
LIC IPO Price Band: ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వివరాలు చూస్తే రూ.10 ఫేస్ వ్యాల్యూతో రూ.902 నుంచి రూ.949 మధ్య ఫిక్స్ చేశారు.
LIC IPO Discount: ఎల్ఐసీ ఐపీఓలో ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు రూ.60 డిస్కౌంట్, రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది.
LIC IPO Quota: ఎల్ఐసీ ఐపీఓలో రీటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 50 శాతం చొప్పున షేర్లను కేటాయించారు. పాలసీహోల్డర్లకు 10 శాతం అంటే 22,137,492 షేర్లు కేటాయించగా, ఎల్ఐసీ ఉద్యోగులకు 1,581,249 షేర్లు కేటాయించారు.
LIC IPO Application: ఎల్ఐసీ ఐపీఓలో ఒక లాట్లో 15 షేర్లకు అప్లై చేయొచ్చు. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు అప్లై చేయొచ్చు. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు 210 షేర్లకు అప్లై చేయొచ్చు. ఒక లాట్‌కు రీటైల్ ఇన్వెస్టర్లు రూ.13,530 నుంచి రూ.14,235 మధ్య, పాలసీహోల్డర్లు రూ.12,630 నుంచి రూ.13,335 మధ్య, ఎల్ఐసీ ఉద్యోగులు రూ.12,855 నుంచి రూ.13,560 మధ్య బిడ్ చేయాల్సి ఉంటుంది.
LIC IPO Allottment: ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేసినవారికి మే 12న షేర్లు అలాట్ చేస్తారు. షేర్లు అలాట్ కానివారికి మే 13 నుంచి రీఫండ్ వస్తుంది. షేర్లు అలాట్ అయినవారికి మే 16న షేర్లు డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి.
LIC IPO GMP: ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ప్రస్తుతం ఒక షేర్‌కి రూ.85 ప్రీమియం లభిస్తోంది.
LIC IPO Listing: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మే 17న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అవుతుంది.
0 Comments:
Post a Comment