ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.. ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. జీవితంలో ఏదైనా సాధించాలన్నా లేదా సాధించినదాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి.
దీనిబట్టి మనిషి జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత ఇట్టే తెలుస్తుంది. ఇటీవల కాలంలో అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటివి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్(Levels) ఎక్కువగా ఉంటే హృదయ సంబంధ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు బయటకు కనిపించవు.
దీంతో దీన్ని సైలెంట్ కిల్లర్ (Silent Killer) అని పిలుస్తారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లెవల్స్(Cholesterol) గుర్తించడానికి రక్త పరీక్ష(Blood Test) అవసరమవుతాయి.
అధిక బరువు లేదా బాడీ ఫ్యాట్ బట్టి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అంచనా వేస్తుంటారు. అయితే కాళ్లతో పాటు శరీరంలోని ఇతర భాగాలలో ఏర్పడే కొన్ని హెచ్చరిక సంకేతాలను బట్టి కొలెస్ట్రాల్ లెవల్ పెరిగాయని గుర్తించాలి.
ధమనుల్లో రక్తం సరఫరాకు అడ్డంకి ఏర్పడితే దాన్ని ఫెరిఫరల్ అర్టిరియర్ వ్యాధి లేదా PAD అని పిలుస్తారు.
సాధారణంగా ధమనులు కాళ్ళకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. అయితే ఈ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడితే కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. అవేంటో పరిశీలిద్దాం.
* కాళ్ల చర్మం రంగు మారడం
అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రవాహం వేగంలో తగ్గుదల ఏర్పడుతుంది. దీంతో శరీర చర్మం రంగును కూడా మార్చవచ్చు.
పోషకాలు, ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రక్త ప్రవాహం తగ్గడం వల్ల కణాలకు సరైన పోషణ లభించకపోవడమే దీనికి కారణం.
కాళ్లను పైకి లేపడానికి ప్రయత్నించడం వల్ల చర్మం లేతగా కనిపించవచ్చు. చర్మం ఊదారంగు లేదా నీలం రంగులో ఉన్నట్లు అనిపిస్తుంది.
* పాదాలు- కాళ్లు చల్లబడటం
అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీ పాదాలు లేదా కాళ్లు ఏడాది పొడవునా, వేసవిలో కూడా చల్లగా అనిపించేలా చేస్తాయి. ఈ సంకేతం PAD వ్యాధిని సూచిస్తుంది. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.
* రాత్రి సమయంలో తిమ్మిర్లు
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారిలో.. నిద్రపోతున్నప్పుడు కాలు తీవ్రమైన తిమ్మిర్లకు గురవుతుంది. ధమనులను దెబ్బతీసే అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ మరొక సాధారణ లక్షణం ఇది. రాత్రి నిద్రపోతున్నప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది.
* పాదాల్లో నొప్పి
కాళ్ల ధమనులు మూసుకుపోయినప్పుడు, ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంత మొత్తంలో శరీర దిగువ భాగానికి చేరదు. దీంతో కాలు బరువుగా అనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్న వారు అవయవాలలో మంట, నొప్పి గుర్తించి డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. తొడ లేదా పిరుదు వరకు కాలులోని ఏదైనా భాగంలో నొప్పి అనిపించవచ్చు. ఒకటి లేదా రెండు కాళ్లలో ఉండవచ్చు.
* నయం కాని పుండ్లు
కాలు లేదా పాదాల వద్ద పుండ్లు నయం కాని పరిస్థితి ఉంటుంది. ఈ రకమైన సమస్య మళ్లీ వస్తుంటుంది. ఇది రక్తప్రసరణ లోపాల వల్ల ఏర్పడుతుంది. PDA ఉన్న వ్యక్తులు అలసట, నొప్పి కారణంగా వేగంగా నడవలేరు.
దీంతో వారు ముందుగానే గుర్తించి చికిత్స పొందినట్లయితే, కాళ్ళ అల్సర్లు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు.
సైలెంట్ కిల్లర్ అయిన అధిక కొలెస్ట్రాల్‌ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
0 Comments:
Post a Comment