ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలపై (Life Insurance cum Investment Policies) ప్రజలకు పెద్దగా అవగాహన ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు.
ఏజెంట్లు, బీమా కంపెనీల నుంచి పారదర్శకత లోపించడం, పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పని చేయని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ (Investment Linked Life Insurance Policies) అనేవి పాలసీ హోల్డర్లకు అధిక రాబడిని అందిస్తాయని కంపెనీలు, ఏజెంట్లు పేర్కొంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
సూపర్ నార్మల్ రిటర్న్‌లేనా?
ఎవరైనా వ్యక్తులు లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) స్కీమ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం ప్రమోట్ చేసిన బీమా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైనదని భావించడమే.
చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) లాగానే ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ నుంచి రాబడులు ఆశిస్తారు.
అయితే ఇవి సూపర్ నార్మల్ రిటర్న్‌లు (Returns) కాదు. రాబడులు ఎప్పుడూ 4-5 శాతం దాటవని వారికి తెలియదు. ఇన్వెస్ట్‌మెంట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లలో పెట్టుపడి పెట్టకపోవడమే మంచిదని సాధారణ పాలసీ హెల్డర్లు తెలుసుకోవాలి.
ఏజెంట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వలలో చిక్కుకోవద్దని కొందరు నిపుణులు (Experts)సూచిస్తున్నారు. ఇందుకు పరిగణించాల్సిన అంశాలను వెల్లడించారు. అవేంటో చూడండి.
రిటర్న్ హామీని చూపించమని..
* పోస్టాఫీసు స్కీమ్‌లు, FDలు కాకుండా, ఏ ఇన్వెస్ట్‌మెంట్ టూల్ రాబడికి హామీ ఇవ్వదు. కాబట్టి పాలసీ డాక్యుమెంట్‌లో రిటర్న్ హామీని చూపించమని మీ ఏజెంట్‌ని అడగండి. మూలధన హామీ పథకాలు వంటి కొన్ని పాలసీలు 8 శాతం రాబడిని అందిస్తాయి. అసలు రాబడిని తెలుసుకోవడానికి మీ ఏజెంట్‌ను XIRR లెక్కింపు వివరాలు అడగండి. ఈ ప్లాన్‌లలో XIRR 4-5 శాతం వరకు మాత్రమే ఉంటుంది.
* గత పదేళ్ల రాబడి వివరాలు విశ్లేషిస్తే.. ఈ స్కీమ్స్‌లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే FDలు, ఫండ్స్‌లో పెట్టుబడి రాబడి కొన్ని రెట్లు అధికంగా పెరిగింది.
* ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు లిక్విడ్‌గా (Liquid) ఉండవు. స్కీమ్ నుంచి ముందుగానే బయటకు వస్తే జరిమానాలు ఉంటాయి. ఈ వివరాలను కస్టమర్‌లకు చెప్పరు. దీంతో చాలా మంది అత్యవసర పరిస్థితి కారణంగా స్కీమ్ నుంచి బయటకు వచ్చి భారీగా నష్టపోతుంటారు.
* పెట్టుబడి (Investment) పెట్టేటప్పుడు పారదర్శకత ముఖ్యం. అయితే చాలామంది ఏజెంట్లు లేదా బీమా కంపెనీలు రిటర్న్‌లు లేదా ఇతర నియమాలను స్పష్టంగా పేర్కొనవు. చాలా కంపెనీలు తప్పుదారి పట్టించే ప్రకటనలను ఇస్తాయి. అందువల్ల వీటిలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఎగ్జిట్/ఎర్లీ క్లోజర్‌పై అన్ని మార్గదర్శకాలను ముందుగానే తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలి.
* ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈక్విటీలలో ఇన్వెస్టర్ ఫండ్స్‌ను (Investor funds) ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియోలు లేదా ఖర్చులను తనిఖీ చేయరు. వీటికి బదులు డబ్బును నేరుగా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. బీమా అనేది లైఫ్‌పై రిస్క్‌ను రక్షించడం కోసమేనని గుర్తించాలి. ఇందుకు టర్మ్ ప్లాన్ (term plan) సరిపోతుంది.
0 Comments:
Post a Comment