High Cholesterol Symptoms: బరువు, నడుము వద్ద కొవ్వు పెరగడం అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా మనిషి లావుగా కనిపించడం కూడా కొవ్వు పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చెడు కొవ్వు పెరుగుదల వల్ల మానవ శరీరానికి అనేక నష్టాలుంటాయని వైద్యులు పేర్కొన్నారు.
చెడు కొలెస్ట్రాల్ మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు పాదాలలో కూడా కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.
పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:
1. అడుగులు వేసినప్పుడు పాదలకు చలిగా అనిపించడం:
చలికాలంలో పాదాలకు చలి ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఎండాకాలంలో కూడా ఇలా జరిగితే.. శరీరానికి ఏదో పెద్ద సమస్య జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతమని నిపుణులు తెలిపారు.
2. పాదాల చర్మంలో రంగుల మార్పు:
అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలకు రక్త సరఫరాపై కూడా ప్రభావం పడుతుంది. దీని ప్రభావం పాదాలపై స్పష్టంగా కనిపిస్తుంది. రక్తం సరఫరా వల్ల లేకపోవడం చర్మం, పాదాల గోళ్ల రంగు మారడం ప్రారంభమవుతుంది.
3. లెగ్ క్రాంప్స్:
రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చాలా మందికి కాలు తిమ్మిరిగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ సంకేతమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని కింది భాగంలో నరాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతమని చెప్పవచ్చు.
4. పాదాలలో నొప్పి:
అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతే కాకుండా తీవ్రమైన నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితులలో సాధారణ నడక సులభం కాదని నిపుణులు అంటున్నారు.
0 Comments:
Post a Comment