Health Tips: నేడు ప్రపంచంలో అత్యంత తీవ్రమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఇందులో అనేక రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి.
దీని కారణంగా కణితులు ఏర్పడతాయి. ప్రారంభంలో ఇది అంత ప్రమాదకరం కాదు కానీ కాలం గడిచినకొద్ది చాలా ప్రమాదకరంగా మారతాయి. క్యాన్సర్ జన్యుపరమైనది అయితే ఇది 5 నుంచి 10 శాతం కేసులలో మాత్రమే కనిపిస్తుంది.
కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం వారు సరైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరం. మద్యం, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలి. అదే సమయంలో ఆహారంపై శ్రద్ధ వహించాలి.
తరచుగా క్యాన్సర్‌ను ప్రోత్సహించే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాంటి ఆహారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1. ప్రాసెస్ చేసిన మీట్
మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. ఇది క్యాన్సర్ సమస్యను మరింత పెంచుతుంది. వీటిలో ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం వాడతారు.
ఇది కడుపు క్యాన్సర్ నుంచి పెద్దప్రేగు క్యాన్సర్ వరకు కారణమవుతుంది. కాబట్టి ఏ పరిస్థితులలోను ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు.
2. బీఫ్ తినకూడదు
క్యాన్సర్ సమస్య ఉన్న కుటుంబాలు గొడ్డు మాంసం తినకూడదు. నిజానికి దీనిని తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
దీనిపై వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ కూడా గొడ్డు మాంసం తినే వ్యక్తులను హెచ్చరించింది. వారంలో 500 గ్రాములు మాత్రమే తినాలని సూచించింది. ఇంతకంటే ఎక్కువ తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి.
3. ఉప్పు
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ మాత్రమే కాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. సాల్ట్ ఫుడ్ ద్వారా కడుపు క్యాన్సర్ సమస్య ఉంటుంది.
కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోకుండా ప్రయత్నించండి. అధిక ఉప్పు ఎప్పుడైనా ఆరోగ్యానికి హానికరం.
4. వేయించిన చేపలు
ఒమేగా 3 చేపలలో ఉన్నప్పటికీ అది బాగా వేయించినట్లయితే దాని లక్షణాలు లోపాలుగా మారుతాయి. ఇది క్యాన్సర్ సమస్యను కలిగిస్తుంది.
వాస్తవానికి చేపలను వేయించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది ప్యాంక్రియాటిక్, అండాశయాలు, కాలేయం, రొమ్ము కొలొరెక్టల్, అన్నవాహిక క్యాన్సర్లకి కారణమవుతుంది.
0 Comments:
Post a Comment