✍️సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పై కసరత్తు
🌻ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషను ఖరారు. చేసేందుక ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ప్రొబేషన్ ను డిక్లేర్ చేసేందుకు అర్హత ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలను రూపొందించాలని ఆశాఖ డైరెక్టర్ సాగిలి షన్ మోహన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లకు సోమవారం సర్క్యులర్ను జారీ చేశారు. ఈ నెల 16వ తేదీలోగా జిల్లాల వారీగా ఏఏ శాఖలలో ఎంత మంది సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ను ఖరారు చేసేందుకు. అర్హులో వివరాలను ఆయాశాఖల విభాగాధిపతులకు (హెచ్ఓడి) పంపించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు ప్రాఫార్మాలను రూపొందించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా అన్ని శాఖలలో మంజూరైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రస్తుతం ఎంత మంది పని చేస్తున్నారు. ప్రొబేషన్ ను డిక్లేర్ చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. హెచ్ఐలకు ఎంతమంది పేర్లను ప్రతిపాదించారో ప్రొఫార్మాలో పేర్కొనాలని తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను మరోక ఫార్మాలో పొందుపరచాలన్నారు. అందులో ఉద్యోగి కోడ్, ప్రస్తుతం పని చేస్తున్న గ్రామం, మండలం, జిల్లా, ఉద్యోగంలో చేరిన తేదీ, సర్వీస్లో ఏమైనా బ్రేక్ ఉందా, ఇప్పటి వరకు ఎన్ని సెలవులు పెట్టారోనన్న వివరాలు, రెండేళ్ల ప్రొబేషన్ ఎప్పటికి పూర్తయింది. ఎప్పటి నుంచి వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయవచ్చోనన్న వివరాలనూ ప్రొఫార్మాలో పొందుపరచాలని షన్మోహన్ సర్క్యులర్లో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment