ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలంటుంటారు మన పెద్దలు. ఈ సామేత ఊరికే అనలేదు. ఏ ఇళ్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
వాస్తు ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్దతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుంది. ప్రతిరోజూ మహిళలు ఇలా చేస్తే ఇంట్లో నుంచి పేదరికం పలాయనం చిత్తగించడం ఖాయం.
* సూర్యోదయం అవ్వకముందే స్త్రీలు ఇంటిని పరిశుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ తాండవిస్తుంది.
* స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే, సూర్యోదయానికి ముందే ఆ పని చేయాలి. సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వల్ల ఇంట్లో పేదరికం కలుగుతుంది.
*ఇంటిని శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతోపాటు ఒంటికి బాధలు తప్పవు.
* కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండటం లాంటిదని అంటారు. అందుకే మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి.
* దైవ ప్రార్థన చేసి.. నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. కడుపునిండా తిని దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
*స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాకుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉండదు. అందుకే, స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండటం మంచిది. ఇది ఇంట్లో శాంతి, ప్రశాంతతను తెస్తుంది.
ఇంట్లోకి సంపద రావాలంటే…?
* సంధ్యాసమయంలో తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
* ఇంటికి నైరుతి మూలలో నీటి సంపులు వంటి నీటి వనరులను నిర్మించకూడదు. ఇది ఇంట్లో పేదరికం, వేదనకు కారణమవుతుంది.
* మీ నగదు పెట్టె లాకర్‌ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచాలి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచితే ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని చాలా మంచి నమ్ముతుంటారు.
* ఇంట్లో నగదు పెట్టెను ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టె ముందు అద్దం ఉంచితే… మీ సంపద రెట్టింపు అవుతుంది.
* కొన్ని ఇండోర్ ప్లాంట్లు, మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరించడంతోపాటు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు.
* ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఇంటి మధ్యలో ఎలాంటివి నిర్మించవద్దు. అయితే, ఒక ఆలయాన్ని మాత్రం నిర్మించవచ్చు.
0 Comments:
Post a Comment