భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు క్రేజ్ పెరిగింది.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా OTT వినియోగం ఇంకా అధికమైంది. ఇంకా.. విపరీతంగా పెరిగిన సినిమా ధరల కారణంగా కూడా సామాన్యులు థియేటర్ కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఓటీటీ లోనే వినోదం పొందుతున్నారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో Netflix, Amazon Prime, G5, Sony Liv, Disney Hot Star + లాంటి అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్ లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ఈ యాప్ లను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌లలో అనేక కొత్తకొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు నిరంతరం అందుబాటులోకి వస్తూ ఉంటాయి.
అయితే.. ఈ డబ్బులను చెల్లించే పరిస్థితి లేని అనేక మంది వాటిని వాడుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం సైతం కొన్ని OTT వేధికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఓటీటీ వేధికల్లో ఉచితంగా సినిమాలు చూడొచ్చు. ఆయా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్‌లను సైతం వీక్షించవచ్చు.
అలాంటి ఓటీటీ యాప్ లకు సంబంధించిన వివరాలను మీకు అందించబోతున్నాం. అయితే ఈ ఓటీటీల్లో సినమాలు లేదా వెబ్ సిరీల్ లు వీక్షిస్తున్న సమయంలో మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఫ్రీగా లభించే ఓటీటీ యాప్ లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
MX Player చాలా సంవత్సరాల క్రితం ఆఫ్‌లైన్ వీడియో ప్లేయర్‌గా మార్కెట్లోకి వచ్చింది. క్రమంగా ఈ యాప్ OTT గా మార్చబడింది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఉచితం.
దీని కోసం, వినియోగదారులు ఎటువంటి సబ్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు 12 భాషలలో సినిమాలను చూడొచ్చు. అనేక ప్రముఖ వెబ్ సిరీస్ లను కూడా చూడొచ్చు.
JioCinema : వినియోగదారులు ఈ యాప్ ను Google Play Store నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు సినిమాలు మరియు టీవీ సిరీస్‌లను ఫ్రీగా చూసే అవకాశాన్ని పొందుతారు. ఇది పూర్తిగా ఉచితం. ఇక్కడ మీరు అనేక భాషల చలనచిత్రాలను సైతం చూడొచ్చు.
Voot : వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ మరియు ఇతర కంటెంట్లను ఉచితంగా చూడాలనుకునే వారికి Voot ఒక గొప్ప ఎంపిక. మీరు దీన్ని Google Play Store మరియు App Store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అనంతరం సైన్ ఇన్ చేయడం ద్వారా ఇందులోని కంటెంట్‌ను ఫ్రీగా వీక్షించే అవకాశాన్ని పొందుతారు. మీరు ఇక్కడ నెట్వర్క్ 18తో అనుసంధానించబడిన అనేక ఛానెల్‌ల ప్రోగ్రామ్‌లను కూడా చూడవచ్చు.
Tubi : హాలీవుడ్ సినిమాలు మరియు షోలను ఇష్టపడే వ్యక్తుల కోసం Tubi యాప్ బెస్ట్. మీరు ఇందులో చాలా హాలీవుడ్ సినిమాలను చూడవచ్చు. ఈ యాప్‌లో మీరు మధ్యలో ప్రకటనలు ఉంటాయి.
0 Comments:
Post a Comment