Electricity Bill Reducing Tips: 24 గంటలు ఏసీ, కూలర్, ఫ్యాన్ వేసినా.. ఈ టిప్స్ తో సగానికంటే తక్కువ కరెంటు బిల్లు!
Electricity Bill Reducing Tips: వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరం ఆన్ లోనే ఉంటాయి.
వీటి సహాయంతో భానుడి తాపం నుంచి ఉపశమనం కోసం వీటిని వినియోగిస్తారు. కానీ, వీటి నిరంతర వినియోగం వల్ల విద్యుత్ బిల్లు సామాన్యులకు భారంగా మారనుంది. అటువంటి పరిస్థితిలో విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు మార్గాలను తెలుసుకుందాం. కొన్ని టిప్స్ తో మీ విద్యుత్ ఛార్జీల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయండి!
భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న కారణంగా వారిలో చాలా మంది ఎండల తాపాన్ని తట్టుకునేందుకు ఇంటికి ఎయిర్ కూలర్లను తెచ్చుకుంటున్నారు. కూలర్ ఫ్యాన్, పంప్ లకు గ్రీస్, ఆయల్ తో క్లీన్ చేయాలి. దీని వల్ల వాటి పనితీరు మరింత మెరుగు అవుతుంది.
కూలర్ కు సంబంధించిన ఫ్యాన్ కండెన్సర్, రెగ్యులేటర్ ను ఎప్పటికప్పుడూ తనిఖీ చేయాలి. సీలింగ్ ఫ్యాన్ లో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ ను మాత్రమే వినియోగించాలి. ఫ్యాన్ కు సంబంధించిన కండెన్సర్ (కెపాసిటర్), బాల్ బేరింగ్ పాడైపోతే వెంటనే కొత్త వాటిని రీప్లేస్ చేయాలి.
24 నుంచి 26 డిగ్రీల మధ్య ఏసీ సెట్ చేసుకోవాలి!
వేసవిలో గంటల తరబడి ఏసీని ఆన్ చేసి ఉంచడం వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. అయితే విద్యుత్ ఛార్జీని తగ్గించుకోవడానికి ఏసీని ఫ్యాన్ మోడ్ లో రన్ చేయడం సహా ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య సెట్ చేయాలి.
10 నుంచి 15 రోజులకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ను బాగా శుభ్రం చేయడం వల్ల చల్లదనం పెరుగుతుంది. ఫిల్టర్లో దుమ్ము పేరుకుపోవడంతో చల్లదనం కోసం ఎక్కువసేపు ఏసీని నడపాల్సి వస్తుంది. దీంతో పాటు ఏసీ రన్ చేసే సమయంలో కిటికీలు, తలుపులు మూసేయడం వల్ల చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు.
0 Comments:
Post a Comment