Diabetes Health Tips: షుగర్ అదుపులో ఉండాలంటే.. డయాబెటీస్ పేషేంట్స్ ఈ నీటిని తీసుకుంటే చాలు!
Diabetes Health Tips, Two Best Ways to use Cinnamon for Diabetes patients: 'దాల్చిన చెక్క' అనేది ప్రపంచవ్యాప్తంగా వంటకాలలో ఉపయోగించే ఓ సాధారణ మసాలా పదార్థం.
దాల్చిన చెక్క మంచి రుచి, వాసన కలిగి ఉండడం మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ మసాలా దినుసును ఒక గ్లాసు నీటిలో చిటికెడు కలిపితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి దాల్చిన చెక్క నీరు ఓ దివ్యౌషధం. షుగర్‌ను నియంత్రించడానికి దాల్చిన చెక్కను తినమని వైద్యులు కూడా రోగులకు సలహా ఇస్తారు.
దాల్చిన చెక్కను నీటితో కలిసి తీసుకుంటే డయాబెటీస్ పేషేంటలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌తో పాటు అదనపు చక్కెరను బయటకు పంపుతుంది. ఇది కాకుండా వేడి నీటిలో దాల్చిన చెక్క వేసి తాగితే.. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. దీనితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులను మరియు అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది.
దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నయం చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఉండే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహానికి సంబంధించిన ఇతర వ్యాధులను నయం చేస్తుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో 1 గ్రాము దాల్చిన చెక్కను తీసుకోవాలి. కర్రీ లేదా నీటిలో తీసుకున్నా పర్వాలేదు.
ఓ గాజు పాత్రలో ఒక లీటరు నీటిని తీసుకుని.. 1 అంగుళం దాల్చిన చెక్కను వేసి రాత్రంతా ఇలాగే ఉంచండి. ఇందులో 2-3 నిమ్మకాయ ముక్కలను కూడా వేయవచ్చు. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు తాగాలి. దీనితో పాటు దాల్చిన చెక్కను నీటిలో మరిగించి కూడా తినవచ్చు. ఇందుకోసం కేవలం రెండు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాలి. ఆ నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి.. చల్లారాక త్రాగవచ్చు. ప్రతిరోజు ఇలా తాగితే ఖచ్చితంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందుతారు.
0 Comments:
Post a Comment