✍️విద్యారంగంలో వినూత్న సంస్కరణలు
♦అంగన్వాడీలు, 1,2 తరగతులు ఒక యూనిట్
♦టెన్త్ వరకు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయులు
♦విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
*🌻శ్రీకాకుళం, ప్రభన్యూస్ బ్యూరో:* రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించి. న జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన విద్యారంగంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలలకు కొత్త రంగులు, హంగులు చేకూర్చి నాడు-నేడు పేరుతో విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కాగా, తాజాగా ఇంతవరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా ఉన్న విధానాన్ని మార్చి గ్రామాల్లో అంగన్వాడీ కేం ద్రాల్లో ఉన్న పిల్లలను, అదే విధంగా 1,2 తరగతులను ఒక యూనిట్గా పరిగణి స్తున్నామన్నారు. 3 నుండి 10వ తరగతి వరకూ ఒక యూనిట్ గా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇంతరవకూ ఉన్నత పాఠశాలల స్థాయిలోనే ఆయా సబ్జెక్టులకు విడివిడిగా ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండేవారని, అయితే ఇప్పుడు 3వ తరగతి నుండే ఆయా సబ్జెక్టులన్నిటికీ ప్రత్యేక ఉపాధ్యాయులను కేటాయిస్తున్నట్లు మంత్రి బొత్సవివరించారు. కాగా మండలాల్లో కొత్తగా జూనియర్ డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇవ్వడం జరగదని, ఆయా మండలాల్లో జూనియర్ కళాశాలలు కావాల్సిన వారు ఆ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా డిగ్రీ కళాశాల కావాలనుకుంటే ఆ మండలంలో ఉన్న జూనియర్ కళాశాలనే డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కాగా ప్రాథమిక పాఠశాలల విలీనానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వినతులు, అక్కడి పరిస్థితుల మేరకు కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలను మాత్రమే విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని భావించామని, అయితే దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, ఆయా ప్రాంతాల నుండి ప్రజా ప్రతినిధుల అభ్యంతరాల మేరకు కిలోమీటర్ పరిధికి తగ్గించామన్నారు. ఇక్కడ కూడా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేసారు.
0 Comments:
Post a Comment