డయాబెటిక్ పేషెంట్లకు ఓ శుభవార్త. పెద్దవాళ్లలో వచ్చే టైప్2 షుగర్ వ్యాధి కొత్త మందు అందుబాటులోకి వచ్చింది.
దీంతో రోజుకు రకరకాల ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు.
టిర్జెపటైడ్ అనే కొత్త మందును వారానికి ఒకసారి తీసుకుంటే పేషెంట్లకు చాలావరకూ ఉపశమనం కలుగుతోంది.
ఇన్సులిన్ మాదిరిగానే దీన్ని కూడా ఇంజెక్షన్ ద్వారా చర్మం కింద తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది గ్లుకగాన్-లైక్ పెప్టైడ్-1 (జీఎల్పీ-1), గ్లూకోజ్-డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ) గ్రాహకాలు రెండింటినీ చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
జీర్ణాశయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తుంది. దీంతో ఆకలి తగ్గి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక పేగుల్లోకి మందు చేరుకోగానే ఇన్సులిన్ ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది.
షుగర్ వ్యాధిని మరింత బాగా నియంత్రణలో ఉంచుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో తేలింది.
సెమాగ్లుటైడ్, దీర్ఘకాలం పనిచేసే రెండు ఇన్సులిన్ అనలాగ్స్తో పోలిస్తే టిర్జెపటైడ్ మరింత సమర్థంగా గ్లూకోజు మోతాదులను తగ్గిస్తున్నట్టు బయటపడింది.
0 Comments:
Post a Comment