జలుబు.. ఒక్కసారి పట్టుకుందంటే వదిలించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. పైగా ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే.. ఇంట్లో మిగిలిన వారందరికి పాకేస్తుంది.
అయితే వర్షాకాలం, చలికాలం ప్రధానంగా వేధించే జలుబు.. కొందరిని సమ్మర్‌లోనూ సతమతం చేస్తుంటుంది. అవును, వేసవి కాలంలోనూ కొందరు జలుబుతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఫ్రిడ్జ్‌లో వాటర్‌ను అధికంగా తాగడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం. తరచూ ఐస్ క్రీమ్స్‌ను తీసుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల జలుబు చేస్తుంటుంది.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా..? అయితే అస్సలు దిగులు చెందకండి. ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా జలుబును తరిమి కొట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలను ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముల్లంగి జలుబును నివారించడంలో బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేయాలి. ఈ ముల్లంగి జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే జలుబు దూరం అవుతుంది.
అలాగే మరో విధంగా కూడా జలుబును తగ్గించుకోవచ్చు. అందులో ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఆపై ఒక అర కప్పు ఉల్లిపాయ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనును కలిపి సేవించాలి. ఇలా చేస్తే జలుబు నుంచి చాలా అంటే చాలా త్వరగా బయట పడొచ్చు.
పైగా వేసవిలో ఉల్లిపాయ, తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక వేడి సైతం తొలగిపోతుంది.
0 Comments:
Post a Comment