ఉద్యోగుల వేతన సవరణకు... ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ?
కేంద్రం... కొత్త ఫార్ములాతో రాబోతోంది
ఏడవ పే కమిషన్ తర్వాత... వేతన స్థిరీకరణ ఎలా ఉండనుంది ?న్యూఢిల్లీ : ఉద్యోగుల వేతన స్థిరీకరణకు సంబంధించి ఏడవ పే కమిషన్ తర్వాత కొత్త పే కమీషన్ ఏర్పాటు కాదా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఇందుకు కారణం... ఉద్యోగుల వేతనాలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాతో రావచ్చునని తెలుస్తుండడమే. కొత్త వేతనాలు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇంక్రిమెంట్ ఆధారంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వేతనం లెక్కింపులో అసెస్‌మెంట్‌కు సంబంధించిన విధివిధానాలు ఇంకా స్పష్టంగా లేని నేపథ్యంలో... కేంద్రం ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కరువుభత్యం(డీఏ) 50 శాతం దాటిన తర్వాత వేతనాన్ని ఆటోమేటిక్‌గా లెక్కించే ఫార్ములాపై ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వినవస్తోంది . మొత్తంమీద కొత్త గణన ‘ఆటోమేటిక్ పే రివిజన్(ఏపీఆర్)’ పేరుతో రూపుదిద్దుకోవచ్చని ప్రభుత్వవర్గాల నుంచి వినవస్తోంది. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 లో 7 వ వేతన సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ అధ్యక్షతన, పే కమిషన్‌లో వివేక్ రాయ్(అప్పటి సెక్రటరీ, పెట్రోలియం & నేచురల్ గ్యాస్), పార్ట్ టైమ్ మెంబర్‌గా రథిన్ రాయ్(అప్పటి డైరెక్టర్, ఎన్‌ఐపీఎఫ్‌పీ), మీనా అగర్వాల్(అప్పటి ఓఎస్‌డీ, వ్యయ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ) కార్యదర్శిగా పే కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్... పద్ధెనిమిది నెలల వ్యవధితో ఈ ఏర్పాటు జరిగింది.
ఇదిలా ఉంటే... ప్రస్తుత వేతన సవరణ సంఘం కాలపరిమితి పూర్తైన తర్వాత... ఇక కొత్తగా వేతన స్థిరీకరణ సంఘాల ఏర్పాటు జరగబోదంటూ వినవస్తోంది. కరువుభతం ఒక పరిమితి దాటిన తర్వాత... ధాని అనుసంధానంగా లెక్కించే అంశాలు, హూలువేతనం(బేసిక్ పే) ప్రాతిపదికన ఆటోమేటిక్‌గా లెక్కిస్తారని, ఈ క్రమంలో ప్రత్యేకంగా ఓ ఫార్ములా రూపుదిద్దుకుంటోందని కేంద్ర ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినవస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే... కేంద్ర ఉద్యోగులు... ప్రతీ ఐదేళ్ళకోమారు తమకు జరగనున్న వేతన స్థిరీకరణలకు సంబంధించి ఎదురుచూపులు చూడాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే... ఈ ఫార్ములా ప్రకారం... ఆటోమేటిక్‌గానే వేతన స్థిరీకరణ జరిగిపోతుంటుంది
0 Comments:
Post a Comment