✍️సెలవుల్లోనూ హెచ్ఎంలు హాజరవ్వాలి
🌻అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనబడి నాడు- నేడు పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యం లో.. నాడు నేడు పనుల నిమిత్తం హెచ్ఎంలు పాఠశాలలకు రావాలని స్పష్టం చేసింది. రెండో దశ నాడు- నేడు పనులను రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 981 పాఠశాలల్లో(హైస్కూల్, ప్రైమరీ స్కూల్స్) చేపట్టేం దుకు అవసరమైన బడ్జెట్ రూ.4 వేల 535.73 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు నేడు పనుల పరిశీలన, పర్యవేక్షణలో ప్రధానోపాధ్యా యులు కీలక పాత్ర పోషిస్తున నేపథ్యంలో వారంతా హాజరు కావాలని, ఈ మేరకు ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment