Face Black spots Tips In telugu : మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు.
అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది. ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు,ఒక స్పూన్ పంచదార పొడి,అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో రసం పిండేసిన నిమ్మచెక్కను ముంచి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖంపై మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు క్రమంగా తగ్గుతాయి. పెరుగు సహజసిద్దమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేసి చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించటానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ముఖం మీద మచ్చలను తగ్గించటానికి సహాయపడతాయి.
పంచదార చర్మం మీద మచ్చలను తొలగించటానికి సహాయపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహాను పాటించాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం చూసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
0 Comments:
Post a Comment